Ram Charan: ఒక తండ్రికి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది!
ABN, First Publish Date - 2023-06-23T14:29:15+05:30
తండ్రైన తర్వాత రామ్‌చరణ్ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘ఏ తండ్రైనా తన బిడ్డను తొలిసారి తాకగానే ఎలాంటి అనుభూతి, ఆనందం కలుగుతుందో నాకూ అలాగే ఉంది. ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. ఓ తండ్రికి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. ఆనందంలో మాటలు కూడా రావడం లేదు’’ అని గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు.
తండ్రైన తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) తొలిసారి మీడియా ముందుకొచ్చారు. తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘ఏ తండ్రైనా తన బిడ్డను తొలిసారి తాకగానే ఎలాంటి అనుభూతి, ఆనందం కలుగుతుందో నాకూ అలాగే ఉంది. ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చింది. ఓ తండ్రికి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. ఆనందంలో మాటలు కూడా రావడం లేదు’’ అని గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు. అపోలో (Ram Charan Pressmeet) ఆస్పత్రి ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాసనకు సుఖ ప్రసవం చేసిన డాక్టర్ సుమన, ఉమా, లత, సుబ్బారెడ్డి అమితా ఇంద్రసేన, తేజస్వినిలతో అపోలో స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసవం జరిగిందని చరణ్ చెప్పారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో ఈ రోజు డిశ్చార్జ్ చేశారని అన్నారు. (Ram charan Happy with Mega princess)
ఈ సందర్భంగా తమ అభిమానంతో దేవుణ్ణి ప్రార్ధించి, ఆశీస్సులు అందించిన మెగా అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రేమ తమ బిడ్డపై ఎప్పుడూ ఉండాలని రామ్‌చరణ్ కోరారు. ‘‘బిడ్డ ఎప్పుడు పుట్టింది అనేది నాన్నగారు ఇప్పటికే చెప్పారు. పాప పట్ల ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. నాకు సంప్రదాయాల గురించి అంతగా తెలీదు. లెక్క ప్రకారం 21వ రోజున పాపకు పేరు పెడతారు. ఇప్పటికే ఉపాసన, నేను ఓ పేరు అనుకున్నాం. ఆ రోజున నేను అందరికీ చెబుతా’’ అన్నారు. ‘పాపది ఎవరి పోలిక’ అన్న ప్రశ్నకు కచ్చితంగా నాన్న పోలికే’ అని చరణ్ నవ్వుతూ సమాధానం చెప్పారు.