RamCharan: తండ్రికి తగ్గ తనయుడు, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అతనికే చెల్లు!
ABN, First Publish Date - 2023-02-27T18:38:29+05:30
రామ్ చరణ్ (#RamCharan), ఈ పేరు ఇప్పుడు ప్రపంచం అంతా మారుమోగుతోంది. 'ఆర్.ఆర్.ఆర్.' (#RRR) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (#JrNTR) తో పాటు ఒక కథానాయకుడిగా నటించిన రామ్ చరణ్, చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. ఒక్క భారతదేశం లోనే కాకుండా, ప్రపంచ సినీ ప్రేక్షకుల చేత ప్రశంసలను అందుకుంటున్నాడు.
రామ్ చరణ్ (#RamCharan), ఈ పేరు ఇప్పుడు ప్రపంచం అంతా మారుమోగుతోంది. 'ఆర్.ఆర్.ఆర్.' (#RRR) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (#JrNTR) తో పాటు ఒక కథానాయకుడిగా నటించిన రామ్ చరణ్, చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. ఒక్క భారతదేశం లోనే కాకుండా, ప్రపంచ సినీ ప్రేక్షకుల చేత ప్రశంసలను అందుకుంటున్నాడు. 'గుడ్ మార్నింగ్ అమెరికా' (#GoodMorningAmerica) అనే అమెరికన్ టాక్ షో (#AmericanTalkShow) లో ప్రత్యేక అతిధిగా వచ్చిన ఒకే ఒక్క భారతీయ నటుడు (#FirstIndianActor) రామ్ చరణ్.
అందులో అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ తనదైన శైలిలో జవాబులు చెప్పి 'శెభాష్' అనిపించుకున్నాడు. ఆ షో లో ప్రశ్నలు అడిగిన హోస్ట్ లు అందరు కోటానుకోట్ల అభిమానులున్న రామ్ చరణ్ వొదిగి కూర్చున్న విధానం, ఆ జవాబులు చెప్పే తీరు చూసి ముచ్చట పడ్డారు.
త్వరలో నాన్నవు కాబోతున్నావ్ కదా అన్న ప్రశ్నకు కూడా, 'వివాహం అయి ఇన్ని సంవత్సరాలు అయినా, మేము ప్లాన్ చేసుకోలేనప్పుడు నేను నా భార్యకి దగ్గరగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు తల్లి కాబోతున్న ఈ సమయం లో నేను ప్యాకింగ్ చేసుకోవడం మళ్ళీ విప్పుకోవటం తో సరిపోతోంది' అని చెప్పాడు. అంటే తాను ఇలా టూర్ లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అని అర్థం.
అదే షో లో జెన్నిఫర్ (#Jennifer) అనే ఆమె తను డాక్టర్ అని గైనకాలజిస్ట్ (gynecologist) అని చెప్పింది. వెంటనే రామ్ చరణ్ నవ్వుతూ, "అవునా, అయితే మీ నెంబర్ నేను తప్పకుండా తీసుకుంటాను. నా భార్య అమెరికాలో కొంత కాలం వచ్చి ఉంటుంది," అని చెప్పాడు. దానికి ఆ డాక్టర్, "మీ బిడ్డను నేను డెలివరీ చెయ్యటం అది నాకు గౌరవం గా భావిస్తాను" అని చెప్పింది.
'ఆర్.ఆర్.ఆర్.' (#RRR) సినిమా గురించి అడిగినప్పుడు, ఆ సినిమా అంత ఒక స్నేహం, సోదరభావం, సహచర్యం గురించి సంభందించినది. మా దర్శకుడు రాజమౌళి (#SSRajamouli) రాసిన ఒక గొప్ప రచనల్లో ఈ సినిమా ఒకటి. రాజమౌళి మాకు అందరికీ ఇండియన్ స్పీల్ బర్గ్ (IndianStevenSpielberg) అని ఆ సినిమా గురించి, రాజమౌళి గురించి గొప్పగా చెప్పాడు. (#RamCharan)
ఈ సినిమాలో 'నాటు నాటు' (#NaatuNaatu) పాటను ఆస్కార్ నామినేషన్స్ (#OscarNominations2023) లో ఉండటం, భారతదేశ సినిమాకి, సాంకేతిక నిపుణలకి గౌరవం తెచ్చింది అని చెప్పాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, ఇంకా ముందు ముందు చాలా ఉంటుంది అని వినంరంగా చెప్పాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ తండ్రి చిరంజీవి (#MegaStarChiranjeevi) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక మెగాస్టార్ (MegaStar). అంత పెద్ద స్టార్ అయినా కూడా చిరంజీవి ఎప్పుడూ పరిశ్రమలో అందరికీ అందుబాటులో ఉంటూ, ఎవరికి ఎటువంటి సాయం కావాలన్నా ముందుండే మనిషి. చిన్న నటుల నుంచి, పెద్ద నటుల వరకు అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడూ వొదిగి, వినమ్రంగా వుండే చిరంజీవికి రామ్ చరణ్ నిజంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అందుకే తండ్రి మెగాస్టార్ అయ్యాడు, తనయుడు మెగా పవర్ స్టార్ (#MegaPowerStar) అయ్యాడు.