కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rakul Preeth singh : కలలు కన్నా.. కష్టపడ్డా.. నేరవేర్చుకున్నా!

ABN, First Publish Date - 2023-09-29T15:35:40+05:30

కన్నడ సినిమా ‘గిల్లీ’తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘కెరటం’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మొదటి విజయాన్ని దక్కించుకున్నారు. తదుపరి  తెలుగులో స్టార్ హీరోస్ సరసన అవకాశాలు అందుకుని సూపర్ హిట్స్ అందుకుంది.

కన్నడ సినిమా ‘గిల్లీ’తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘కెరటం’తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో మొదటి విజయాన్ని దక్కించుకున్నారు. తదుపరి  తెలుగులో స్టార్ హీరోస్ సరసన అవకాశాలు అందుకుని సూపర్ హిట్స్ అందుకుంది. 'కొండపొలం' తర్వాత ఆమె  తెలుగులో  సినిమా చేయలేదు. ప్రస్తుతం బాలీవుడ్ మీదే దృష్టి పెట్టింది.  ప్రస్తుతం ఆమె చేతిలో ఇండియన్ -2తో పాటు హిందీలో మూడు చిత్రాలున్నాయి. బాలీవుడ్ నటి  భూమీ ఫడ్నేకర్‌ రకుల్ ప్రీత్ సింగ్ కి ఓ టాస్క్ ఇచ్చింది.  భూమి, షెహనాజ్‌ గిల్‌, కుషా కపిలా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌’ (Thank you for Coming). యూత్‌ఫుల్‌ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  నేపథ్యంలోనే తన సినీ కెరీర్‌ ఎలా మొదలైందో తెలియజేస్తూ భూమి ఫడ్నేకర్‌ ఓ పోస్ట్‌ పెట్టారు. అనంతరం ఆమె రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అనిల్‌ కపూర్‌తోపాటు పలువురు యువ నటీనటులను ట్యాగ్‌ చేస్తూ.. వారి కథలనూ తెలియజేయాలని కోరారు. దీంతో రకుల్‌ (Rakul Preet Singh) తన సినీ  ప్రయాణాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘‘చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి రావాలని కలలు కన్నా. ఇండస్ట్రీలో నాకు ఎవరు లేరు. ఈ రంగం గురించి సరైన అవగాహన లేదు. ఏమీ తెలియని రోజుల్లో మోడలింగ్‌ నుంచి మిస్‌ ఇండియా.. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చాను. అందరి కష్టాలలాగే నావి కూడా. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. నటిగా ఎంపిక చేయడం, కారణం లేకుండా తిరస్కరించడం ఇలా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. పరిశ్రమలోకి అడుగుపెట్టాలన్న ఆశతో కుటుంబాన్ని వదిలి ముంబయిలో అడుగుపెట్టి ఒక్కదాన్నే జీవితాన్ని కొనసాగించాను. టీనేజ్ అమ్మాయి ఫ్యామిని వదిలి ఒంటరిగా జీవించడం ఎంత కష్టమో తెల్సిందే. ఆ సమయంలో నేను  తీసుకున్న కీలక నిర్ణయం. నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చింది.

ఆడిషన్స్‌ కోసం క్యూ లైన్స్‌లో నిలబడటం.. ఆఫర్స్‌ కోసం క్యాస్టింగ్‌ ఏజెంట్స్‌ - దర్శకులకు వరుస కాల్స్‌ చేయడం, సినిమాలకు సంతకం చేసిన తర్వాత.. చివరి నిమిషంలో నా స్థానంలో వేరే ఒకరిని తీసుకోవడం.. ఇలాంటి ఎన్నో అనుభవాలు చూశా. చివరకు సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.  మీ  అందరి మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నా.  ధైర్యం, నమ్మకంతో ప్రతీ సమస్యను ఎదుర్కొన్నాను. కఠోర శ్రమతో లక్ష్యాన్ని సాధించాను.  ఈ ప్రయాణంలో ప్రతీది ఒక అందమైన పాఠాన్ని నేర్పించింది. కుటుంబం తోడుగా ఉండటంతోనే ఈ స్థాయికి రాగలిగాను’’ అని రకుల్ పేర్కొన్నారు. 

Updated Date - 2023-09-29T15:49:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!