కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rakul Preet Singh : జీవితాన్ని ఇచ్చిన చిత్రానికి పదేళ్లు! 

ABN, First Publish Date - 2023-12-01T11:29:33+05:30

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet) పరిచయం అక్కర్లేని కథానాయిక. ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని అందుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet) పరిచయం అక్కర్లేని కథానాయిక. ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని అందుకుంది. ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయైున రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్గా  తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో భావోద్వేగంగా పోస్ట్‌ చేసింది. ఆమె తెలుగులో నటించిన రెండో చిత్రం. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ (Venkatadri Express) సందీప్‌ కిషన్ కు జోడీగా నటించిన ఈ చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. Ṭ

ఈ సందర్భంగా తనకు జీవితాన్ని ఇచ్చిన చిత్రమంటూ సోషల్‌ మీడియా వేదికగా ఈ సినిమా గురించి ఓ పోస్ట్‌ పెట్టింది రకుల్‌. ‘‘విజయవంతమైన చిత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' విడుదలై దశాబ్దం పూర్తి చేసుకుంది. కెరీర్‌ బిగినింగ్‌లో నా జర్నీకి ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఈ చిత్రం నాకు జీవితాన్ని ఇచ్చింది. ఇలాంటి ప్రత్యేకమైన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి, చిత్రబృందానికి ధన్యవాదాలు. ఈ చిత్రంతోనే నన్ను తెలుగు అమ్మాయిగా అంగీకరించిన ప్రేక్షకులు అందరికీ థ్యాంక్స్‌’’ అని పోస్ట్‌లో పేర్కొంది రకుల్‌. ఆమె తెలుగు తెరపై కనిపించి రెండున్నరేళ్లు కావొస్తుంది. 'కొండ పొలం’ తర్వాత తెలుగులో మరో చిత్రంలో కనిపించలేదు. ఇప్పుడు ఆమె దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. ప్రస్తుతం తమిళంలో శంకర్‌ తెరకెక్కిస్తున్న ఇండియన2’, హిందీలో ‘అయలాన్‌’ సినిమాలతో బిజీగా ఉంది. రకుల్‌ ఈ ఏడాదితో టాలీవుడ్‌కి ఎంటీర ఇచ్చి పుష్కర కాలం పూర్తి చేసుకుంది. 


Updated Date - 2023-12-01T11:29:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!