RakulPreetSingh: ఏంటి ఇంతపని చేసింది, ఇలా మునకేసేసింది
ABN, First Publish Date - 2023-05-06T14:15:15+05:30
రకుల్ ప్రీత్ సింగ్ అటు హిందీ సినిమాలతో, ఇటు దక్షిణాది భాషలతో బిజీ గా ఉంటూ, మధ్యలో షూటింగ్ కి బ్రేక్ తీసుకొని, స్నేహితులతో కలిసి ఎదో విహారానికి వెళ్లి ఏమి చేసిందో చూడండి
ఇటు దక్షిణాది భాషల్లో, అటు హిందీలో బిజీ గా వున్న నటీమణుల్లో రకుల్ ప్రీత్ (RakulPreet) ఒకరు. ఈమె తెలుగులో అందరి అగ్ర నటుల పక్కన చేసేసింది, అలాగే అగ్ర నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతోంది. అయితే ఇప్పుడు ఎక్కువగా హిందీ సినిమాల మీదే దృష్టి బాగా పెట్టినట్టుంది, అందుకే తెలుగులో అంతగా కనపడటం లేదు.
ఆమె 2021 లో విడుదల అయిన, క్రిష్ (Director Krish) దర్శకత్వం వహించిన 'కొండపొలం' (Kondapolam) అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర నటనా ప్రావీణ్యానికి సాన బెట్టే విధంగా ఉంటుంది, ఆమె కూడా తన ప్రతిభతో మెప్పించింది కూడా. 'ఛత్రివాలి' (Chhatriwali) అనే వెబ్ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది, అలాగే ఇందులో ఒక సమాజానికి పనికొచ్చే మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడింది, అలాగే రకుల్ కి చాలా మంచి పేరు తీసుకువచ్చింది.
రకుల్ ఇప్పుడు కమల్ హాసన్ (KamalHaasan) నటిస్తున్న 'ఇండియన్ 2' (Indian2) లో చేస్తోంది. దీనికి శంకర్ (Shankar) దర్శకుడు కాగా, ఇందులో కాజల్ అగర్వాల్ (KajalAgarwal) కూడా వుంది. అలాగే ఇంకో తమిళ సినిమా కూడా చేస్తోంది. దక్షిణాదిలో ఇప్పుడు ఈ రెండు సినిమాలు వున్నాయి, అలాగే హిందీలో కూడా సినిమాలు చేస్తోంది.
రకుల్, నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీ ( Jackky Bhagnani) తో రిలేషన్ షిప్ లో వుంది. దాని గురించి ఇప్పుడు ఆమె ఓపెన్ గానే మాట్లాడుతుంది కూడా. అలాగే రకుల్, మంచు లక్ష్మి (ManchuLakshmi) కి మంచి స్నేహితురాలు. మంచు లక్ష్మి చారిటీ ఈవెంట్ 'టీచ్ ఫర్ చేంజ్' కి రకుల్ మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అలాగే సమాజం లో జరిగే కొన్ని సంఘటనలకు మొహమాటం లేకుండా తన అభిప్రాయాలను చెపుతూ ఉంటుంది కూడా.
మరి ఇప్పుడు రకుల్ ఏమి చేసింది అంటే, మైనస్ డిగ్రీ లో వున్న నీటిలో ఒక్క మునకవేసి వచ్చింది. కొందరు ఏమంటారు అంటే దీనినే క్రయోథెరపీ (Whole body cryotherapy) అని కూడా అంటారు అని చెప్తున్నారు. ఇలా మైనస్ డిగ్రీ లో వున్న నీటిలో మునక వేస్తె అగరొగ్యానికి మెరుగు అని కూడా అంటారు, కానీ అందులో నిజమెంతో తెలీదు. అలాగే ఆలా మునకలు వేస్తె, చర్మం యవ్వనం లో ఉన్నట్టు కనపడుతుంది అని కూడా అంటారు, అది కూడా నిజమో, అబద్దమో తెలీదు. కానీ రకుల్ ఆలా పక్కనే ఐస్ గడ్డలు వున్న చల్లని నీటిలో మునక ఎలా వేసిందో చూడండి.