Rakesh Master: జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. మట్టిలో కలవడం తప్ప!
ABN, First Publish Date - 2023-06-19T11:47:36+05:30
‘‘ఇల్లు, దుస్తులు, శరీరం జీవితంలో ఇవేమీ శాశ్వతం. బూడిద కావడం, మట్టిలో కలవడం మాత్రం శాశ్వతం అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూయలో రాకేశ్ మాస్టర్ అన్నారు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రాకేశ్ మాస్టర్ అలియాస్ రామారావు (53) ఆదివారం సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే! గతంలో పలు ఇంటర్వ్యూల్లో రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చిన ఆసక్తికర విషయాలివి...
‘‘ఇల్లు, దుస్తులు, శరీరం జీవితంలో ఇవేమీ శాశ్వతం. బూడిద కావడం, మట్టిలో కలవడం మాత్రం శాశ్వతం అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూయలో రాకేశ్ మాస్టర్ (Rakesh master) అన్నారు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న రాకేశ్ మాస్టర్ అలియాస్ రామారావు (53) ఆదివారం సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే! దాదాపు 1500 పాటలకు నృత్యరీతుల్ని సమకూర్చిన ఆయన ఆకస్మిక మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. వేణు, రవితేజ, ప్రభాస్, రామ్ వంటి హీరోల పాటలకు ఆయన కొరియోగ్రఫీ అందించారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియా, యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉన్నారు. ఆయన ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూలు వివాదస్పదమయ్యాయి. ఆయన్ని అభిమానించే వారు ఆ వీడియోలను షేర్ చేస్తూ, జ్ఞాపకాల్పి గుర్తు చేసుకుంటున్నారు. గతంలో పలు ఇంటర్వ్యూల్లో రాకేశ్ మాస్టర్ చెప్పుకొచ్చిన ఆసక్తికర విషయాలివి...Rakesh master is no more)
పలు డాన్స్ షోలతో పాపులర్ అయిన రాకేశ్ మాస్టర్ ‘చిరునవ్వుతో’ చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. తొట్టెంపూడి వేణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ‘నిన్నలా మొన్నలా లేదురా’ పాటకు రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆ అవకాశంతో ఎంతో ఆనందించానని రాకేశ్ మాస్టర్ చెబుతుండేవారు. ఆయన జీవితంలో ఆవే మధుర క్షణాలని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. (Rakesh Master last words)
డాన్స్ మాస్టర్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించిన ఆయన శేఖర్, జానీ, సత్య వంటివారిని కొరియోగ్రాఫర్స్‌గా తయారు చేశారు. ప్రస్తుతం వారంతా టాప్ కొరియోగ్రాఫర్స్‌గా ఉన్నారు. అయితే రాకేశ్ మాస్టన్ ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయారు. ఓ వ్యక్తి దగ్గర రూ. రెండు లక్షలు అప్పు చేసి, రూ. 30 వేలు తిరిగి ఇచ్చారు. కొన్ని రోజులకు అప్పు ఇచ్చిన వ్యక్తి మరణించారు. ఆయన కొడుకు వచ్చి డబ్బులు అడిగితే తన ఇంటికి సంబంధించిన పత్రాలు ఇచ్చేశారు. అదే సమయంలో వచ్చిన వ్యక్తితో ‘మీ నాన్నకు డబ్పులన్నీ తిరిగి ఇచ్చేశా’ అని కూడా చెప్పొచ్చు. అది మోసం అవుతుంది’’ అని రాకేశ్ మాస్టర్ చెప్పారు. తనని తప్ప ఎవర్నీ నమ్మనని రాకేశ్ తరచూ చెబుతుండేవారు. (RIP Rakesh)
ఇంత జర్నీలో నాతో ఎంతోమంది ట్రావెల్ చేశారు. కొందరు తిరిగి వెళ్లిపోయారు. ‘నీ మాస్టర్‌ని నమ్మితే నీ జీవితం మాడిపోయిన దోసలా అవుతుంది’ అని శేఖర్‌తో ఎవరో అన్నారట. అయినా శేఖర్ నన్ను వదిలి వెళ్లలేదు. నా దగ్గర ఉంటే విషమైనా, తీపి అయినా కలిసి పంచుకుందామని అందరికీ నేర్పా. ఆ మాటకు కట్టుబడి శేఖర్, సత్యం నా దగ్గరే ఉన్నారు. చాలాకాలం ఆకలితో స్నేహం చేశా’’ అని ‘ఢీ’ షోలో భావోద్వేగానికి గురయ్యారు.
ఇల్లు, దుస్తులు, శరీరం జీవితంలో ఇవేమీ శాశ్వతం. బూడిద కావడం, మట్టిలో కలవడం మాత్రం శాశ్వతం అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్యూయలో రాకేశ్ మాస్టర్ అన్నారు. తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధిత వీడియో తీసినట్లు ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నా మామగారు సమాధి పక్కన వేప మొక్క ఒకటి నాటా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని విజ్ఞప్తి చేశా’’ అని రాకేశ్ చెప్పారు.
నా అనుకున్న వాళ్లంతా చనిపోవడంతో జీవితంపై విరక్తి కలిగింది. నా తమ్ముడంటే నాకు చాలా ఇష్టం. తను చనిపోయినప్పుడు ఎంత బాధ పడ్డానో నాకే తెలుసు. తర్వాత, అమ్మ చనిపోయింది. అక్క కొడుకు చనిపోయాడు. నాన్న చనిపోయాడు. నాకు చావంటే భయం లేదుగానీ ఈ సంఘటనల వల్ల ఏదన్నా ఫోన్ కాల్ వస్తే భయపడిపోయేవాణ్ని’’ అని కన్నీరుమున్నీరయ్యారు రాకేశ్ మాస్టర్.