సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajoshi Barua: ఆశిష్‌ విద్యార్థి రెండో పెళ్లి.. మొదటి భార్య షాకింగ్‌ కామెంట్స్‌!

ABN, First Publish Date - 2023-05-30T18:00:01+05:30

సీనియర్‌ నటుడు ఆశిష్‌ విద్యార్థి తాజాగా రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. అసోంకు చెందిన రూపాళి బారువాను ఆయన ఇటీవల వివాహం చేసుకున్నాడు. ఇదే విషయంపై అశిష్‌ విద్యార్థి మొదటి భార్య రాజోషి బారువ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ నటుడు ఆశిష్‌ విద్యార్థి (Ashish Vidyarthi)తాజాగా రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చారు. అసోంకు చెందిన రూపాళి బారువాను (Rupali barua)ఆయన ఇటీవల వివాహం చేసుకున్నాడు. 60 ఏళ్ల వయసుల్లో పెళ్లి ఏంటి? అని గత నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఇదే విషయంపై అశిష్‌ విద్యార్థి మొదటి భార్య రాజోషి బారువ(Rajoshi barua) స్పందించారు.

ఆమె బెంగాల్‌కు చెందిన నటి, గాయని, థియేటర్‌ ఆర్టిస్ట్‌. రేడియో జాకీ కూడా. ఆమె తల్లి శకుంతలా బారువా పేరొందిన నటి. రాజోషి బారువ తన భర్తతో తెగతెంపులు అయిపోయినా ఇంటి పేరు విద్యార్థి అనే కొనసాగిస్తోంది. అశిష్‌ విద్యార్ధిపై తనకు ఎలాంటి కంప్లైంట్‌ లేదని చెబుతోంది. వీరిద్దరూ 22 ఏళ్లు కలిసున్నారు. గత అక్టోబర్‌లో పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేశారు. అయినా ఫ్రెండ్స్‌గానే ఉన్నారు. వీరిద్దరికీ ఓ బాబు ఆర్థ్‌ ఉన్నాడు. అతను టెస్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆశిష్‌పై ఎలాంటి కంప్లైంట్‌ లేదని చెబుతోంది పిల్లూ విద్యార్ధి. పైగా తన లైఫ్‌లో ది బెస్ట్‌ టైమ్‌ ఆశిష్‌తో కలిసున్న కాలమే అని చెబుతోందామె!

రాజోషి బారువా మాట్లాడుతూ ‘‘మా ఇద్దరి భవిష్యత్తు కోరికలు వేర్వేరుగా ఉన్నాయి. అవి మా మద్య చిన్న గీతను ఏర్పాటు చేశాయి. అది క్రమేపీ బలపడింది. తనకు నచ్చినట్లు బతికే హక్కు ఆయనకు ఉంది. అందుకు ఇద్దరం ఒక మాట మీద విడిపోవాలనుకున్నాం. మా బిడ్డ కూడా దానిని అర్థం చేసుకున్నాడు. ఇద్దరం వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే పనిలో ఉన్నాం. కారణాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నేను శ్రీమతి విద్యార్థిగా ఉండలేను. అది పూర్తిస్థాయిలో అర్థమయ్యాకే విడిపోయాం. అశిష్‌ మళ్లీ పెళ్లిచేసుకోవడం వల్ల నాకేమీ మోసం జరిగినట్లు కాదు. విడిపోయిన తర్వాత తను వేరే పెళ్లి చేసుకుంటే నాకు అభ్యంతరం ఏముంటుంది. ఆయనకు ఇప్పుడు ఓ భాగస్వామి కావాలి. తనకు అది అసవరం.. సరైన ఎంపిక చేసుకున్నాడు. నాకు మరొకరి తోడు అవసరం లేదు. ఇలాగే ఉంటాను. ఇప్పటిదాకా శకుంతల బారువా బిడ్డగా, అశిష్‌ విద్యార్ధి భార్యగా ఉన్న గుర్తింపును దాటి సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తాను. ఆయన నా ఆశల్ని, జీవితాన్ని, కోరికల్ని ఎప్పుడు అణచివేయలేదు. ఇప్పటికీ నా గురించి ఆయన మనసులో మంచి అభిప్రాయమే ఉంటుందని నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-05-30T18:03:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!