Adipurush: ఈ సినిమా అందుకే జనాలకి నచ్చలేదు, రాజమౌళి అయితే న్యాయం చేసేవాడు: సీనియర్ నటుడు సుమన్
ABN, First Publish Date - 2023-06-21T15:37:04+05:30
రాముడు ఎప్పుడూ నీలమేఘ శ్యాముడు కాబట్టి, నీలంగానే ఉండాలి అని, గెడ్డలు మీసాలు వుండకూడదు అని, రాజమౌళి లాంటి దర్శకుడు అయితే ఈ 'ఆదిపురుష్' లాంటి సినిమాలకి న్యాయం చేస్తాడు అని సుమన్ చెప్పాడు. పౌరాణిక సినిమాలు తీయాలంటే సౌత్ బెస్ట్ అని చెప్పాడు సుమన్. ఈ సినిమాలో అవుట్ ఫీట్స్ బాగోలేవు అని చెప్పాడు సుమన్.
'ఆదిపురుష్' #Adipurush సినిమా మీద విమర్శల వెల్లువ పోటెత్తింది. సీనియర్ నటుడు సుమన్ (ActorSuman) వెంకటేశ్వర స్వామి, రాముడు, సత్యనారాయణ స్వామి లాంటి పౌరాణిక పాత్రలు వేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. 'ఆదిపురుష్' #AdipurushControversy పౌరాణిక సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో భావోద్వేగాలు లేవు, పండలేదు అని చెప్పాడు సుమన్. "మాకు తెలిసి రాముడు, కృష్ణుడు అంటే నీలంగానే కనపడతారు, అలాగే గెడ్డం, మీసాలు వుండవు. రాముడు అంటే రామారావు (NTRamaRao) గారే గుర్తొస్తారు, అతను ఎప్పుడూ మీసాలు, గెడ్డం పెట్టలేదు. కానీ ఇందులో ప్రభాస్ #Prabhas కి గెడ్డం, మీసాలు పెట్టారు, అవి లేకుండా పెట్టాల్సింది. ఈ సినిమాలో ఆలా చెయ్యడం పెద్ద రిస్క్," అని చెప్పాడు సుమన్.
అయితే మళ్ళీ శివుడు కి రాముడికి తేడా వుంది అని చెప్పాడు. శివుడికి మీసం ఉంటుంది అతని పాత్ర వేరేలా ఉంటుంది, కానీ రాముడుకి వుండవు. రాముడు అంటే దేవుడు కాదు, మానవుడిగా ఈ భూమ్మీదకి వచ్చి ధర్మంగా ఎలా నడుచుకోవాలో చెప్పిన వ్యక్తి. అయితే అది ప్రభాస్ (Prabhas) తప్పు కాదని, దర్శకుడు ఎలా చెపితే ఆలా చేసాడు అతను అని ప్రభాస్ ని సమర్దించాడు సుమన్. కానీ రాముడు అవుట్ ఫిట్స్ బాగోలేవు అని చెప్పాడు సుమన్. అలాగే రాముడు ప్రతాపాన్ని, పౌరుషాన్ని బాగా చూపించలేకపోయారు ఈ సినిమా అది ఒక పెద్ద తప్పు అని చెప్పాడు సుమన్.
ప్రభాస్ బాడీ బాగా మెంటైన్ చేసాడు, ఎందుకంటే రెండేళ్లపాటు ఈ సినిమా తీసినట్టున్నారు ఆలా మెంటైన్ చెయ్యడం కష్టం, అందుకు ప్రభాస్ ని మెచ్చుకోవాలి, కానీ గెడ్డం, మీసం మాత్రం నాకు నచ్చలేదు. రావణాసురిడి క్యారెక్టర్ నచ్చింది కానీ అతని అవుట్ ఫిట్ మాత్రం అసలు నచ్చలేదు. మోడరన్ లుక్ లో గ్లాడియేటర్ లా, హాలీవుడ్ లుక్ తీసుకొచ్చారు, అది బాగోలేదు. అలాగే లక్ష్మణుడికి కూడా డ్రెస్ బాగోలేదు అని చెప్పాడు సుమన్. ఓం రౌత్ (OmRaut) ఈ సినిమాకి దర్శకుడు, సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) రావణాసురిడిగా నటించాడు.
రామాయణం #Ramayanam అనేది ఒక ఇతిహాసం, చరిత్ర, అది ఇంకో వెర్షన్ చెప్పాలంటే చాలా జాగ్రత్తగా చెప్పాలి, తీయాలి. కానీ దర్శకుడు చాలా మార్పులు చేసాడు, రామాయణం అందరికీ తెలిసిన కథ, అది తీయటం అంత సులువు కాదు. ఇందులో గ్రాఫిక్స్ కొన్ని బాగున్నాయి, కొన్నయితే మరీ నాసిరకంగా పెట్టేసారు. సహజత్వం ఎక్కడా కనిపించలేదు, పాటలు మాత్రం బాగున్నాయి, సీత పాత్రలో కృతి సనన్ (KritiSanon) బాగా చేసింది అని చెప్పాడు సుమన్.
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రామాయణం మారలేదు, కానీ ఈ 'ఆదిపురుష్' లో అన్నీ మార్చి చూపించారు, అది ఒక తప్పు. అలాగే ఈ సినిమాలో చాలా ప్రయోగాలు చేశారు, అది చాలా పెద్ద రిస్క్ చేసినట్టే, అది ప్రేక్షకులకి నచ్చలేదు అని చెప్పాడు సుమన్. ఏమైనా పౌరాణిక సినిమాలు అంటే దక్షిణాదివారు మాత్రమే తీయగలరు, ఎందుకంటే వాళ్ళకి ఆ కథ మీద అంత పట్టు ఉంటుంది అని చెప్పాడు సుమన్.
తాను నటించిన 'అన్నమయ్య' #Annamayya సినిమాలో చాలా సన్నివేశాలు చూస్తే కళ్ళలో నీళ్లు వస్తాయి అని చెప్పాడు. అలాగే 'శ్రీరామదాసు' #Sriramadasu సినిమాలో కూడా సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి అని, ప్రత్యేకంగా నాగార్జున (AkkineniNagarjuna) జైలు లో చేసిన సన్నివేశాలు భావోద్వేగంగా ఉంటాయి అని చెప్పాడు సుమన్.
సినిమా ప్రేక్షకుడికి కనెక్టు కావాలి అని చెప్పాడు సుమన్. పాత్రల స్వభావాలు, వాళ్లకు వేయాల్సిన అవుట్ ఫిట్స్, ఆభరణాలు ఇలాంటివి అన్నీ మన సౌత్ బెస్ట్ అని అన్నాడు సుమన్. 'ఆదిపురుష్' #Adipurush లాంటి సినిమా చెయ్యాలంటే రాజమౌళి (SSRajamouli) లాంటి దర్శకుడు చేస్తే న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పాడు. అతనికి తెలుసు ఎలా చెయ్యాలి, కథ మీద, కథనం మీద, పాత్రల మీద అతనికి వున్న కమాండ్ అతని అయితే బెస్ట్ ఇస్తాడు అని రాజమౌళి గురించి చెప్పాడు సుమన్. రెండేళ్లు ఈ 'ఆదిపురుష్' సినిమా చేశారు, కానీ ఇందులో ఆ తప్పులు లేకుండా మరికొంచెం శ్రద్ధ పెడితే ఈ సినిమా అంతర్జాతీయ సినిమా అయి ఉండేది అని చెప్పాడు సుమన్.