Rahul Sipligunj - Rathika : ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు?
ABN, First Publish Date - 2023-09-21T16:32:38+05:30
బిగ్‌బాస్ (Biggboss) హౌస్‌లో లవ్ స్టంట్స్, పులిహోర కలపడాలు, ట్రాక్ వేయడాలు కామన్‌గా జరుగుతుంటాయి. ఇదంతా బిగ్‌బాస్ ఇంట్లో ప్రస్తుతం జరుగుతుంటే కాస్త కంటెంట్.. దొరుకుతుంది.. లవ్ ట్రాక్ బావుంటే వ్యూవర్స్ రేట్ పెరుగుతుంది.
బిగ్‌బాస్ (Biggboss) హౌస్‌లో లవ్ స్టంట్స్, పులిహోర కలపడాలు, ట్రాక్ వేయడాలు కామన్‌గా జరుగుతుంటాయి. ఇదంతా బిగ్‌బాస్ ఇంట్లో ప్రస్తుతం జరుగుతుంటే కాస్త కంటెంట్.. దొరుకుతుంది.. లవ్ ట్రాక్ బావుంటే వ్యూవర్స్ రేట్ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఓ కొత్త ట్రాక్ మొదలైంది(love track). అది ఎవరితో అనుకుంటున్నారా? హౌస్‌లో అత్యంత అతి చేసే రతిక. హౌస్‌లో అడుగుపెట్టిన కొత్తలో ఈ అమ్మాయి బాగుంది, ఆటాడితే ఇంకా బాగుంటుంది అనుకున్నారంతా! జనాల ఆలోచనకు తగ్గట్టే ఆమె కూడా చేసింది. రెండో వారానికి వచ్చేసరికి తను బిగ్‌బాస్ ఇచ్చిన గేమ్ ఆడకుండా హౌస్‌మేట్స్‌తో ఆడింది. సహనానికి పరీక్ష పెడుతూ తను అన్నదే కరెక్ట్ అన్నట్లు ప్రవర్తించింది. ఆల్‌రెడీ ఒకరితో ట్రాక్‌లో ఉంది. అది నడుపుతూనే వెన్నుపోటు పొడవడానికి గేమ్స్ మొదలుపెట్టింది. తాజా ఎపిసోడ్‌లో మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తొస్తున్నాడంటూ ఎమోషన్ అయిపోయింది. ఛాన్స్ దొరికితే అతని ప్రస్తావనే తీసుకొస్తుంది. అతడు (Rathika) గుర్తొస్తే మైండ్ పని చేయడమే ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. అతడు సింగర్ అని కూడా చెప్పింది. అంత హింట్ ఇచ్చాక నెటిజన్లు ఊరుకుంటారా? అతగాడు ఎవరో కాదు.. రాహుల్ సిప్లిగంజ్ అంటూ ఫొటోలు వైరల్ చేస్తున్నారు. ఈ విషయంపై తాజాగా రాహుల్ స్పందించాడు. ‘‘ఈ ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? కొందరు తమ ప్రతిభతో ఏదైనా సాధించాలనుకుంటారు. నిరూపించుకుంటారు. కొందరు ఉంటారు పక్కనోళ్ల పేరు, ఫేమ్ మీద ఆధారపడి బతుకుతారు. వారి గుర్తింపు కోసం ఎదుటివారి పేరును అవసరానికి మించి వాడుకుంటున్నారు’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. తదుపరి ఓ అనుమానం వ్యక్తం చేశాడు. (Rahulsipligunj)
‘‘నాకో డౌట్.. ఆరేళ్ల తర్వాత సడన్‌గా వారి పర్సనల్ ఫోన్‌లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో ఎలా ప్రత్యక్షమయ్యాయి? అంటే.. లోపలికి వెళ్లడానికి ముందే ఇదంతా ప్లాన్ చేసుకున్నారా? దీనికి సరైన అన్సర్ ఏంటో మీకే అర్థమవుతుందనుకుంటా! అక్కడున్నది అబ్బాయైునా, అమ్మాయైునా వారి జీవితాలతో నాకెటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు. అలాంటిది.. ఇలా ఫోటోలు లీక్ చేసి ఇబ్బంది పెట్టేముందు క్షణం ఆలోచించాల్సింది. ఎదుటివ్యక్తి కుటుంబం, స్నేహితులు ఎంతగాగా ఎఫెక్ట్ అవుతారో ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం రెండూ ఉంటాయి. అసలేం జరిగిందో తెలియకుండా ఎవరిది తప్పు? ఒప్పు? అని డిసైడ్ చేయకండి?. ఇది అర్థం చేసుకున్నవారికి థాంక్యూ.. లేదా విషాన్ని చిమ్ముతామనుకునేవారికి ఆల్ ద బెస్ట్. అలాగే లోపల ఉన్న వ్యక్తికి ఆల్ ద బెస్ట్. పైసల్ తీసుకున్న టీమ్‌కి కంగ్రాట్స్’’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు.