Rahul Ramakrishna: తండ్రైన రాహుల్ రామకృష్ణ.. సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్ట్..
ABN, First Publish Date - 2023-01-16T15:11:53+05:30
ప్రముఖ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) తండ్రి అయ్యాడు. సంక్రాంతి రోజున తన భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు
ప్రముఖ కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) తండ్రి అయ్యాడు. సంక్రాంతి రోజున తన భార్య హరిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన కుమారుడి ఫొటోను షేర్ చేశాడు. ‘‘మగబిడ్డ.. సంక్రాంతి రిలీజ్’’ అని రాహుల్ పోస్ట్ పెట్టాడు. ఈ విషయం తెలియడంతోనే సామాన్యులతో సహా సెలబ్రిటీలు రాహుల్‌కు శుభాకాంక్షలు చెప్పారు. బీవీఎస్ రవి, వేణు ఉడుగుల, గోపీ మోహన్ తదితరులు విషెస్ తెలిపిన వారిలో ఉన్నారు.
రాహుల్ రామకృష్ణ గతంలో గర్ల్‌ఫ్రెండ్‌కు ముద్దు ఇస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు. వివాహానికి సంబంధించిన ఇతర ఏ విషయాలను అతడు తెలపలేదు. కానీ, గతేడాది నవంబర్‌లో తన భార్య ప్రెగ్నెంట్‌గా ఉందని చెప్పి అందరికి షాకిచ్చాడు. రాహుల్ రామకృష్ణ షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్‌ను ఆరంభించాడు. అనంతరం కమెడియన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాలోని శివ పాత్రతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. అనంతరం ‘గీత గోవిందం’ (Geetha Govindam) ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) వంటి చిత్రాల్లో కీలకమైన పాత్రలను పోషించాడు.