సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pushpa 2: ప్రత్యేకమైన ఆ సీన్‌ షూటింగ్‌కు 35 రోజులు!

ABN, First Publish Date - 2023-04-28T20:34:31+05:30

అల్లు అర్జున్‌ (Allu arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఏ రేంజ్‌ హిట్‌ అయిందో తెలిసిందే! దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న పుష్ప-2 (Pushpa 2) అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు సుకుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్‌ (Allu arjun) నటించిన ‘పుష్ప’ (Pushpa) ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఏ రేంజ్‌ హిట్‌ అయిందో తెలిసిందే! దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న పుష్ప-2 (Pushpa 2) అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు సుకుమార్‌ (sukumar). బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సర్‌ప్రైజ్‌ గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ మూవీలోని ఇంటర్వెల్‌ సీన్‌పై ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. పోస్టర్‌లో అమ్మవారి లుక్‌లో ఉన్న బన్ని పోస్టర్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! ఇంటర్వెల్‌ ముందు సన్నివేశంలో గంగమ్మ జాతర నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నాయని, ఆ బ్యాంగ్‌ మొత్తం బన్నీ అమ్మవారి పాత్రలో కనిపిస్తారట. ఆ ఒక్క సన్నివేశానికి ఏకంగా 35 రోజులు చిత్రీకరించారట. ఈ సీన్‌ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఆ లుక్‌ కోసం అర్జున్‌ మేకప్‌ కోసం మూడు గంటల సమయం పట్టిందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. (highlight scene for movie)

అయితే ‘పుష్ప-2’తోపాటు ఎన్టీఆర్‌30 షూటింగ్‌ కూడా అక్కడే జరుగుతోంది. ఇద్దరూ ఒకే హోటల్‌లో ఉంటున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ బన్నీని సరదాగా కలిశారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా కథానాయిక.

Updated Date - 2023-04-28T20:34:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!