కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagadish alias Kesava : యువతిని దగ్గర చేసుకోవడంకోసమే అలా చేశాడా?

ABN, First Publish Date - 2023-12-17T07:54:07+05:30

'పుష్ప' (Pushpa) చిత్రంలో కేశవ పాత్రతో తనదైన శైలి చిత్తూరు స్లాంగ్‌తో అలరించిన బండారు ప్రతాప్‌ అలియాస్‌ జగదీష్‌ను (Jagadish alias Kesava) పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే! ఓ యువతి ఆత్మహత్యకు కారణమైన కేసులో అతన్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు.

'పుష్ప' (Pushpa) చిత్రంలో కేశవ పాత్రతో తనదైన శైలి చిత్తూరు స్లాంగ్‌తో అలరించిన బండారు ప్రతాప్‌ అలియాస్‌ జగదీష్‌ను (Jagadish alias Kesava) పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే! ఓ యువతి ఆత్మహత్యకు కారణమైన కేసులో అతన్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. గతంలో తనతో సన్నిహితంగా ఉన్న యువతి మరొకరికి దగ్గరవడం భరించలేక.. మళ్లీ దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె ఫొటోలు తీసి భయపెట్టినట్లు విచారణలో జగదీష్‌ చెప్పినట్లు తెలుస్తోంది. సినీ అవకాశాల కోసం హైద్రాబాద్ కు  చేరిన జగదీశ్‌కు అయిదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయమైంది. కొంతకాలానికి అది ప్రేమగా మారి.. శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు రావటంతో సినిమా అవకాశాలు పెరిగి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతని తీరు నచ్చని సదరు యువతి మరో వ్యక్తికి దగ్గరైంది. అది గమనించిన జగదీష్‌ ఏదోలాగా ఆమెను దగ్గర చేసుకోవాలనుకున్నాడు.

గత నెల 27న పంజాగుట్ట పోలీస్‌ స్టేషన పరిధిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సన్నిహితంగా ఉండటం చూసి సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు. వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానంటూ బెదిరించాడు. దీన్ని అవమానంగా భావించిన యువతి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జగదీశ్‌ బెదిరింపులతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించిన ఆమె తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీశ్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కస్టడీలోకి తీసుకొని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. రెండు రోజుల కస్టడీ ముగియటంతో మళ్లీ రిమాండుకు తరలించారు.

Updated Date - 2023-12-17T08:15:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!