సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pushpa 2: పులి రెండడుగులు వెనక్కి... పుష్పరాజ్‌ రికార్డ్‌!

ABN, First Publish Date - 2023-04-09T00:12:00+05:30

పుష్ప – 2’ టీజర్‌ చూసి చిరంజీవి ఫిదా అయ్యారు. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ‘పుష్ప: ది రూల్‌’ టీజర్‌, కొత్త లుక్‌ను మెచ్చుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్‌ప్రైజ్‌ లుక్‌.. చిరు స్పందన! (Chiranjeevi Reaction)

'పుష్ప – 2’ టీజర్‌ చూసి చిరంజీవి ఫిదా అయ్యారు. బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa the rule) టీజర్‌, కొత్త లుక్‌ను మెచ్చుకున్నారు. శనివారం అల్లు అర్జున్‌ (allu arjun) పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేశారు. అందులో అమ్మవారి గెటప్‌లో ఉన్న బన్నీ స్టిల్‌ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. తిరుపతి, చిత్తూరు నేపథ్యంలో సాగే కథ కావడంతో అక్కడ జరిగే తిరుపతి గంగమ్మ (Gangamma jathara) జాతర ఇతివృత్తాన్ని తీసుకుని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప2’లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. చిరంజీవి బన్నీ కొత్త స్టిల్‌పై స్పందించారు. ‘హ్యాపీబర్త్‌ డియర్‌ బన్నీ.. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. పుష్ప: దిల్‌ రూల్‌లోని నీ ఫస్ట్‌ లుక్‌ అదిరిపోయింది. ఆల్‌ ది వెరీ బెస్ట్‌’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయనతోపాటు ఎన్టీఆర్‌, రష్మిక ఇలా మంది తారలు సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘మా పుష్పరాజ్‌కు హ్యాపీయెస్ట్‌ బర్త్‌డే. ఈ ప్రపంచం మొత్తం మళ్లీ నీ యాక్షన్‌ చూడాలని వేచి చూస్తోంది. ఈసారి పుష్పను మరింత ప్రేమిస్తారు తగ్గేదేలే’’ అంటూ బన్నీతో దిగిన ఫొటో షేర్‌ చేశారు శ్రీవల్లి పాత్రధారి రష్మిక మందన్నా.

‘వేర్‌ ఈజ్‌ పుష్ప’ (Where is pushpa Teaser trends) అంటూ విడుదల చేసిన వీడియో ఎంతగా వైరల్‌ అయిందో అంతకు మించి సర్‌ప్రైజ్‌ గ్లింప్స్‌లో ‘‘అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే.. పుష్ప వచ్చిండాడు అని అర్థం’’ అంటూ చెప్పిన వైరల్‌ అవుతుంది. ఈ ఒక్క డైలాగ్‌ బన్నీ లుక్‌ సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి. వేర్‌ ఈజ్‌ పుష్ప వీడియో 24 గంటల్లో అయితే 24 గంటల్లో ఎక్కువ అత్యంత ఎక్కువమంది చూసిన తెలుగు టీజర్‌లతో మూడో స్థానంలో నిలిచింది. దాదాపు 22మిలియన్లకు పైగా తెలుగు వీడియో వీక్షించారు. హిందీ వెర్షన్‌ వీడియో 30 మిలియన్‌ వ్యూస్‌ దాటింది.

Updated Date - 2023-04-09T09:13:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!