సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pushpa 2: పులే రెండడుగులు వెనక్కి వేసిందంటే.. ‘పుష్ప’ వచ్చినాడని అర్థం

ABN, First Publish Date - 2023-04-07T16:57:28+05:30

‘‘అడవిలో జంతువులు రెండడుగు వెనక్కి వేసినాయంటే పులి వచ్చినాదని అర్థం.. (Pushpa 2 Concept teaser) అదే పులే రెండడుగులు వెనక్కి వేసిందంటే ‘పుష్ప’ వచ్చినాడని అర్థం’’ సోషల్‌ మీడియాని ప్రస్తుతం షేక్‌ చేస్తున్న డైలాగ్‌ ఇది. (allu arjun)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘అడవిలో జంతువులు రెండడుగు వెనక్కి వేసినాయంటే పులి వచ్చినాదని అర్థం.. (Pushpa 2 Concept teaser)

అదే పులే రెండడుగులు వెనక్కి వేసిందంటే ‘పుష్ప’ వచ్చినాడని అర్థం’’ (Pushpa the rule)

సోషల్‌ మీడియాని ప్రస్తుతం షేక్‌ చేస్తున్న డైలాగ్‌ ఇది. (allu arjun)

పుష్పరాజ్‌ ఎక్కడ?.. ‘వేర్‌ ఈజ్‌ పుష్ప?’ (where is pushp) అంటూ రెండు మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్‌ పడింది. ‘పుష్పరాజ్‌ ఏమయ్యాడు?’ అనేది తెలుసుకోవాలంటే వెయిట్‌ చేయాల్సిందే అంటూ.. మేకర్స్‌ విడుదల చేసిన టీజర్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే. ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ మేకర్స్‌ శుక్రవారం మూడు నిమిషాల 17 సెకెన్ల నిడివి గల ట్రైలర్‌ను విడుదల చేశారు. శనివారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ గ్లింప్స్‌లో ఏముందంటే.. (pushpa Teaser viral)

‘‘తిరుపతి జైల్‌ నుంచి బులెట్‌ గాయాలతో తప్పించుకున్న పుష్ప...

ఆ ప్రయత్నంలో పోలీసులు పది రౌండ్లల కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. (Pushpa 2)

శేషాచలం అడవుల్లో పుష్ప జాడ కోసం మొదలైన కూంబింగ్‌ ఆపరేషన్‌..

పుష్ప మరణించాడా.. బతికే ఉన్నాడా?

నెల రోజులు అయినా చల్లారని అల్లర్లు.. పలు చోట్ట కొనసాగుతున్న 144 సెక్షన్లు..

పుష్ప అసలు బతికే లేడని కొందరు అంటుంటే... అతను జపాన్‌, మలేషియా, చైనాలో ఉన్నాడని కొందరు అంటున్నారు..

బాక్రాపేట కొండపై ఎనిమిది బుల్లెట్‌ రంధ్రాలు, రక్తపు మరకలతో పుష్ప దుస్తులు కనుగొన్న సెర్చ్‌ టీమ్‌..

అంటూ న్యూన్‌ ఛానళ్లలో వార్తలు..

మరోవైపు అతని మద్దతుదారులు తిరుగుబాటు..

పుష్ప ఏం చేసి దుడ్డు సంపాదిస్తున్నాడో చెప్తాండారు కానీ.. సంపాదించిన దుడ్డు ఏం చేస్తాండాడో చెప్తాండారా? అంటూ ఓ వ్యాపారి ప్రశ్న..

నా కొడుక్కి గుండె ఆపరేషన్‌ అంటే పుష్పనే దుడ్డు పంపించినాడప్ప... ఓ తల్లి కృతజ్ఞత..

నా బిడ్డ పెండ్లికి పుష్పనే డబ్బు సర్దుబాటు చేశాడు.. ఓ తండ్రి కృతజ్ఞత..

మాలాంటోళ్లకి కూడు పెడతాండు...

పుష్ప గురించి సామాన్యుల మాట..

ఇలా ఎన్నో ప్రశ్నలు... పరంపలు...

కట్‌ చేస్తే... అడవి.. అక్కడో పులి..

ఓ మనిషిని చూసి రెండు అడుగులు వెనక్కి తగ్గిన పులి..

‘‘అడవిలో జంతువులు రెండడుగు వెనక్కి వేసినాయంటే పులి వచ్చినాదని అర్థం..

అదే పులే రెండడుగులు వెనక్కి వేసిందంటే ‘పుష్ప’ వచ్చినాడని అర్థం’’ పుష్పను అభిమానించే వ్యక్తి మాట.

ఎదురుగా మెరిసే కళ్లతో.. ముసుగులో ఓ మనిషి.. అతన్ని చూసి రెండు అడుగులు వెనక్కి తగ్గిన పులి..

ఇది పుష్ఫగాడి రూల్‌ అంటూ తనదైన మేనరిజంతో కూర్చున అల్లు అర్జున్‌.

ఇది కాన్సెన్‌ టీజర్‌లో ఉన్న విషయం.

శనివానం బన్నీ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్‌ టీమ్‌ విడుదల చేసిన ఈ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. సుకుమార్‌ ఆలోచనలకు తగ్గట్లే అంచనాలకు రెట్టింపు చేసేలా ఈ టీజర్‌ ఉంది.

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై విజయం సాధించిన పుష్ప చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే!

Updated Date - 2023-04-07T17:00:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!