Puri Jagannadh: ‘హ్యాపీ నౌ హియర్.. ఈ క్షణం కోసం బ్రతకండి’
ABN, First Publish Date - 2023-01-01T12:05:38+05:30
మంచి డైరెక్టర్‌గానే కాకుండా మంచి ఫిలాసఫర్‌గా గుర్తింపు ఉన్న అతి కొద్దిమంది దర్శకుల్లో పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఒకరు.
మంచి డైరెక్టర్‌గానే కాకుండా మంచి ఫిలాసఫర్‌గా గుర్తింపు ఉన్న అతి కొద్దిమంది దర్శకుల్లో పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఒకరు. పూరీ సినిమాల్లో హీరోల్లాగే ఆయన కూడా కొంచెం కటువుగా నిజాలను చెబుతుంటాడు. తాజాగా పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ‘హ్యాపీ నౌ హియర్’ (Happy now Here) పాడ్‌కాస్ట్‌ని విడుదల చేశాడు. అందులో రేపటి కోసం ఈ రోజుల ఆనందాన్ని పక్కన పెట్టేయకూడదని ఆయన అందులో చెప్పుకొచ్చారు.
ఆ పాడ్‌కాస్ట్‌లో పూరి మాట్లాడుతూ.. 'మనందరి కోరిక ఒకటే. హ్యాపీగా ఉండటం. హ్యాపీగా ఉండాలంటే దానికి ముందు చిన్న కష్టం కూడా ఉండాలి. ఎందుకంటే కష్టం తర్వాతే హ్యాపీనెస్ వస్తుందని మనకి తెలుసు. అందుకే కష్టం కూడా మనమే క్రియేట్ చేసుకుని అన్‌హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకున్నాం. హమ్మయ్య రేపటి నుంచి మన కష్టాలు తీరిపోతాయనుకుంటున్నాం. అంటే రేపటిలో మన ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. సంతోషాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాం. మనం నెక్ట్స్ ఇయర్ కుమ్మేద్దాం అనుకుంటాం. మరి ఇప్పుడు ఈ క్షణం ఏమైంది. నీకు దమ్ముంటే ఈరోజే కుమ్మేయ్. నెక్ట్స్ ఈయర్ దాకా ఎందుకు?.
కొత్త సంవత్సరం రిజల్యూషన్స్ పెట్టుకుంటాం. జనవరి 1 నుంచి మంది మానేద్దాం. పేకాల మానేద్దాం. ఉదయమే లేచి యోగాలాంటివి చేసేద్దాం. ఆ రోజు వరకు ఎందుకు.. ఈ రోజే తాగడం మానేయ్. ఈ డిసెంబర్ 31ని సెలబ్రేట్ చేయడం మానేయ్. కానీ అలా చేయం. అంటే రేపటి ఆనందం కోసం ఈ రోజుని ఎంజాయ్ చేయడం మానేస్తాం. వర్తమానానికి ఎప్పుడూ విలువ ఇవ్వం. భవిష్యత్తులో ఆనందం కోసం ఎదురుచూస్తూ ఉంటాం.
నీ చేతుల్లో ఉన్న ఈ క్షణంలో ఆనందం గురించి నువ్వు ఎప్పుడూ పట్టించుకోవు. అందుకే సంతోషంగా ఉండాలనే కోరిక.. కోరికగానే మిగిలిపోతుంది. ఈ రోజు నువ్వు ఆనందంగా లేకపోతే కొత్త సంవత్సరం ఎప్పుడూ బావుండదు. రాబోయే ఆనందం కోసం ఎదురుచూస్తున్నావంటే అర్థం ఏంటి?. నీకు హ్యాపీగా ఉండడం తెలియదని. ఈ ఏడాది కాకపోతే.. వచ్చే ఏడాది.. కష్టాలు తీరిపోతాయిలే అనుకుంటూ బ్రతుకుతావు. ఆ రోజు ఎప్పుడూ రాదు. అందుకే ఈ రోజు ఆనందం కోసం ఏదైనా చేయి తప్ప.. వచ్చే ఏడాది కోసం అలాగే ఉండిపోకు. మారిపోవాలి అనుకుంటే ఇప్పుడే మారిపో. ఆనందం అనేది భవిష్యత్తులో ఉండదు.. ఈ క్షణంలోనే ఉంటుంది. అందుకే హ్యాపీ నౌ హియర్’ అని చెప్పుకొచ్చాడు.