Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..
ABN, First Publish Date - 2023-02-25T16:03:09+05:30
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని పాపులార్ ప్రొడక్షన్ హౌస్స్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’ వంటి క్లాసిక్స్ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని పాపులార్ ప్రొడక్షన్ హౌస్స్‌లో వైజయంతి మూవీస్ ఒకటి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’ వంటి క్లాసిక్స్ ఈ నిర్మాణ సంస్థ నుంచి వచ్చినవే. తాజాగా ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ప్రాజెక్ట్ కె’ (Project K)ను నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. ప్రభాస్ (Prabhas), దీపికా పదుకొణె (Deepika Padukone) హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ (AshwiniDutt) ఈ మధ్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ‘ప్రాజెక్ట్ కె’ కు సంబంధించిన అనేక ఆసక్తికర సంగతులను ప్రేక్షకులతో పంచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చినట్టు చెప్పారు.
‘‘సావిత్రమ్మ జీవితంలోని ఎత్తుపల్లాలను నాగ్ అశ్విన్ వెండితెర మీద చూపించిన విధానం నన్ను ఆకట్టుకుంది. ‘మహానటి’ ని తెరకెక్కించిన విధానం చూసి నేను సర్‌ప్రైజ్ అయ్యాను. ‘ప్రాజెక్ట్ కె’ లోను అనేక భావోద్వేగాలు ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా మీరు అటువంటి దృశ్యాలను చూసి ఉండరు. ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. అమెరికా, సౌతాఫ్రికాతో సహా ఇండియాకు చెందిన వారు స్టంట్స్‌ను కొరియోగ్రఫ్ చేస్తున్నారు. మిక్కి జె. మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం లేదు. సంతోష్ నారాయణన్‌తో సహా బాలీవుడ్‌కు చెందిన లేడీ మ్యూజిషియన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. చిత్రంలో చాలా మంది నటీనటులు ఉన్నారు. వారి పేర్లను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం. ‘ప్రాజెక్ట్ కె’ పై నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది’’ అని అశ్వినీదత్ చెప్పారు.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
ఇవి కూడా చదవండి:
Simbu: ఎట్టకేలకు శింబు పెళ్లి.. ఎవరితోనో తెలుసా..?
RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్
Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్
Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!