సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sankranthi Box-Office: నిర్మాతలు లెక్కలు చెప్పకపోవచ్చు

ABN, First Publish Date - 2023-01-10T16:57:07+05:30

తెలుగు సినిమా అభిమానులు, ముఖ్యంగా ఆయా నటులకి చెందిన అభిమానులకి మొదటి రోజు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే విషయం మీదే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలు, ఒకటి 'వీరసింహా రెడ్డి', (Veerasimha Reddy) ఇంకా రెండోది చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya). ఈ రెండు సినిమాలకి నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అవటం ఆసక్తికరం. అయితే రెండు సినిమాలకి కూడా వీలయినన్ని ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నారు, అలాగే వీలయినన్ని ఎక్కువ షోస్ కూడా వేస్తున్నారు. (These two films are getting maximum theaters and numbers of shows) దిల్ రాజు (Dil Raju) సినిమా 'వారసుడు' (Varasudu) వెనక్కి వెళ్లడం తో ఆ థియేటర్స్ కూడా ఈ రెండు సినిమాలకే దక్కాయి. అయితే తెలుగు సినిమా అభిమానులు, ముఖ్యంగా ఆయా నటులకి చెందిన అభిమానులకి మొదటి రోజు ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనే విషయం మీదే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

అయితే రెండు సినిమాలకి ఒకరే నిర్మాత అవ్వటం, సినిమాల్లో స్టార్స్ ఈ నిర్మాతలకి కావాల్సి రావటం వలన నిర్మాతలు రెండు సినిమాలకి ఏది ఎంత కలెక్ట్ చేసింది అనే విషయం తాపీగా ప్రకటించవచ్చు అని తెలిసింది. (Film collections) ఎందుకంటే 'వీరసింహ రెడ్డి' ఎక్కువ కలెక్ట్ చేసి, చిరంజీవి సినిమా తక్కువ కలెక్ట్ చేసింది అని లెక్కలు వస్తే, చిరు అభిమానులు నిర్మాతలని ట్రోల్ చేయొచ్చు. లేదా అటు ఇటు తేడా వస్తే, 'వీరసింహ రెడ్డి' అభిమానులు ట్రోల్ చేయొచ్చు, అందుకని ఇద్దరి అభిమానులను కించ పరచకుండా మొదటి రోజు లెక్కలు అధికారికంగా చెప్పకపోవచ్చు అని తెలిసింది. ఒకవేళ రెండు సినిమాలు పెద్ద హిట్ అయి, కలెక్షన్స్ బాగుంటే, అప్పుడు ఏమైనా కొంచెం లీక్స్ వదులుతారేమో మరి చూడాలి అని కూడా అంటున్నారు. ఏమైనా నిర్మాతలకి కొంచెం ఇరకాటంలో పెట్టే పండగే ఈ సంక్రాంతి అని పరిశ్రమలో టాక్.

Updated Date - 2023-01-10T16:57:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!