Exclusive Breaking News: దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి, ఎవరితో, ఎప్పుడు ఎక్కడ...
ABN, First Publish Date - 2023-09-09T12:34:53+05:30
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇంట్లో పెళ్లి బాజాలు త్వరలో మోగనున్నాయి. సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ వివాహం నిశ్చయం అయింది. అతను చేసుకోబోయే అమ్మాయి, వివాహం ఎక్కడ జరగబోతోంది ఈ వివరాలు అన్నీ...
-- సురేష్ కవిరాయని
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (DaggubatiSureshBabu) ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇంతకీ వరుడు ఎవరు అనుకుంటున్నారా, అదేనండీ సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ (DaggubatiAbhiram). అవును అభిరామ్ త్వరలో పెళ్ళికొడుకు కానున్నాడు. ఇంతకీ అమ్మాయి ఎవరనుకుంటున్నారా, వాళ్ళ బంధువులే అని తెలిసింది. దివంగత రామానాయుడు గారి తమ్ముడు మనవరాలినే అభిరాం పెళ్లాడబోతున్నాడు. ఇప్పుడు దగ్గుబాటి (DaggubatiFamily) కుటుంబం అంతా ఈ పెళ్లి హడావిడిలో వున్నట్టుగా తెలిసింది.
రామానాయుడు తమ్ముడు కూతురు కూతురినే (అంటే సురేష్ బాబుకి చెల్లెలి కూతురు) అభిరాం వివాహం చేసుకోబోయే అమ్మాయి అని తెలిసింది. ఆమె మాస్ కమ్యూనికేషన్ చేసిందని కూడా తెలిసింది. ఆ కుటుంబం కూడా కారంచేడు లో వుంటున్నారని కూడా తెలిసింది. దగ్గుబాటి రామానాయుడు (Ramanaidu) గారు కుటుంబం అంతా ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామం నుండి వచ్చారు. అక్కడ రామానాయుడు గారికి ఇల్లు, పొలం అన్నీ వున్నాయి. ఆ ఊరుతో దగ్గుబాటి కుటుంబ అనుబంధం కొన్ని దశాబ్దాల నుండి వుంది.
అభిరామ్, ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి ఒకరికొకరు ఇష్టపడుతూ వున్నారని, ఈ రెండు కుటుంబాలు ఎప్పుడో ఈ వివాహానికి అంగీకారం తెలిపాయని కూడా తెలిసింది. దివంగత రామానాయుడు గారి కోరిక కూడా ఇదే అని కూడా ఆ కుటుంబవర్గాలు చెప్పాయి. అయితే వివాహం మాత్రం ఇండియాలో జరగటం లేదని తెలిసింది. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ గా చెయ్యాలని దగ్గుబాటి కుటుంబం భావించి, శ్రీలంక (Sri Lanka) అందుకు తగిన చోటుగా ఎంచుకున్నారు.
ఇంతకీ వివాహం ఎప్పుడు అని అనుకుంటున్నారా, డిసెంబర్ 6 (December 6) న జరుగుతోంది. ప్రస్తుతం పెళ్లి పనుల్లో అందరూ బిజీగా వున్నారు. శుభలేఖలు కూడా చాలా వైవిధ్యంగా తయారు చేయిస్తున్నారు. కారంచేడులో రామానాయుడుగారు వున్న ఆ పాత ఇల్లు అప్పట్లో ఎలా ఉండేదో అలానే డిజైన్ చేయించి పెళ్లి శుభలేఖలమీద అచ్చు వేయిస్తున్నారు. అలాగే కారంచేడు లోని దగ్గుబాటి కుటుంబానికి అనుబంధంగా వున్న మరికొన్ని గుర్తులు కూడా శుభలేఖలమీద కనపడనున్నాయి అని తెలిసింది. దగ్గుబాటి కుటుంబాలు అన్నీ ఈ పెళ్ళికి ఒక దగ్గరకి చేరుతున్నారు కదా, అందుకని ఆ పాత గుర్తులు అన్నీ శుభలేఖలు మీద కనపడనున్నాయి. (DaggubatiFamily)
దగ్గుబాటి అభిరామ్ నటుడిగా ఆరంగేట్రం చేసిన సినిమా 'అహింస' ఈమధ్యనే విడుదలైంది. ఇప్పుడు అభిరాం ఒక కాఫీ షాపును కూడా ఓపెన్ చేస్తున్నాడు, ఆ పనుల్లో అతను బిజీగా వున్నారు. 'రైటర్స్ కాఫీ షాప్' అని రామానాయుడు స్టూడియో పక్కనే ఈ షాపును ఓపెన్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మామూలుగా సినిమాకి సంబదించిన చాలామంది ఎక్కువగా కాఫీ షాపుల్లోనే తమ చర్చలు సాగుతుంటాయి కాబట్టి, ఫిలింనగర్ కి దగ్గరలో వున్న ఈ కాఫీ షాపు అందుకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు.
అభిరామ్ అన్నయ్య రానా దగ్గుబాటి (RanaDaggubati) వివాహం 2020 లో అతని స్నేహితురాలు మిహిక బజాజ్ (MiheekaBajaj) తో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అతని తమ్ముడు అభిరామ్ వివాహం ఈ డిసెంబర్ 6 న శ్రీలంకలో జరుగబోతోంది. దగ్గుబాటి ఇంట్లో మళ్ళీ పెళ్లి బాజాలు మోగనున్నాయి. సురేష్ బాబు కుమార్తె మాళవిక (Malavika) ఈ పెళ్లి పర్యవేక్షణ చేస్తున్నట్టుగా తెలిసింది.