సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

SSMB28: క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ, మే31న అప్డేట్ ఉంటుందిట

ABN, First Publish Date - 2023-04-27T12:34:20+05:30

ఒక పక్క ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది, అసలు సినిమా ఉంటుందా, ఉండదా అని సాంఘీక మాధ్యమం లో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్న సమయం లో మహేష్, త్రివిక్రమ్ సినిమా నిర్మాత నాగవంశీ ఏమి చెప్పాడో తెలుసా..

Mahesh Babu and Trivikram Srinivas
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేష్ బాబు (MaheshBabu), త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి అనేక వదంతులు వ్యాపిస్తున్న ఈ తరుణంలో ఆ సినిమా నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ట్విట్టర్ వేదిక గా సినిమా గురించి ఒక అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే విడుదల అయినా మహేష్ బాబు ఫస్ట్ లుక్ అందరికీ నచ్చే ఉంటుంది అని అలాగే మే 31, సూపర్ స్టార్ కృష్ణ (SuperStarKrishna) గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వస్తుందని కూడా చెప్పాడు.

మామూలుగా మహేష్ సినిమాలు ఏమైనా షూటింగ్, #SSMB28 లేదా కొత్త సినిమాల గురించి అప్డేట్, టీజర్, ట్రైలర్ లాంటివి అతని నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన మే 31 (May31) న ఇస్తూ వుంటారు. అది కృష్ణ, మహేష్ బాబు అభిమానుల కోసం ఆలా చేస్తూ వుంటారు. ఇప్పుడు ఈ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా కూడా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు, అందుకోసమే అన్నట్టుగా నిర్మాత వంశి ఉంటుందని కూడా చెప్పాడు.

ఇప్పుడు ఈ సినిమా మీద వస్తున్న రూమర్లకు కూడా వంశీ చెక్ #SSMB28 పెట్టినట్టుగా ఈ ట్వీట్ పెట్టాడు. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ సినిమా పెద్ద బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని అంటున్నాడు. అయితే ఈ సినిమా మీద ఎటువంటి రూమర్లు స్ప్రెడ్ చెయ్యకుండా వదిలేస్తే షూటింగ్ సజావుగా చేసుకుంటామని చెప్పాడు. అలాగే ఈ సినిమా జనవరి 2024 సంక్రాంతికి విడుదల అవుతుందని మరోసారి గుర్తు చేసాడు. దీనితో ఈ సినిమా మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే అవన్నీ నివృత్తి అయినట్టే అని నిర్మాత భవిస్తూ ఉండొచ్చు.

Updated Date - 2023-04-27T12:34:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!