Daggubati Suresh Babu: చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి సురేష్ బాబు సంచలన కామెంట్స్
ABN, First Publish Date - 2023-09-19T13:15:34+05:30
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ గురించి కామెంట్ చెయ్యమని అడిగితే తనదైన శైలిలో జవాబిచ్చారు. ఇంతకీ సురేష్ బాబు ఏమన్నారు అంటే...
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (DSureshBabu) చంద్రబాబు నాయుడు (ChandrababuNaidu) అక్రమ అరెస్టు మీద స్పందించారు. అయితే అది చాలా సున్నితమైన సమస్య అని, చిత్ర పరిశ్రమ ఎప్పుడూ రాజకీయంగా, మతపరంగా ఎటువంటి ప్రటకనలు ఇవ్వదని, అందుకని దీని మీద కూడా ఎటువంటి ప్రకటన ఇవ్వలేరని చెప్పారు. "పరిశ్రమ ఎప్పుడూ రాజకీయంగా ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదు. ఎందుకంటే మేము రాజకీయనాయకులం కాదు, మేము మీడియా వాళ్ళం కాదు, మేము సినిమాలు నిర్మించడానికి వచ్చాం, సినిమాలు తీస్తాం. నన్ను అడిగితే కనక, చిత్ర పరిశ్రమ రాజకీయాల ప్రకటనలు ఇవ్వటం మంచిది కాదు అని అనుకుంటున్నాను", అని చెప్పారు సురేష్ బాబు.
చంద్రబాబు నాయుడు చిత్ర పరిశ్రమకి చాలా చేశారు, అందుకని అతని అరెస్టు గురించి చిత్ర పరిశ్రమలో ఎక్కువమంది స్పందించటం లేదు అని అడిగినప్పుడు, సురేష్ బాబు స్పందిస్తూ పరిశ్రమకి చాలామంది చాలా చేశారు అని చెప్పారు. "మా నాన్నగారు (రామానాయుడు) (RamaNaidu) తెలుగు దేశం మెంబెర్ (TDP), నేను పార్టీ కి పని చేసాను. అది మా వ్యక్తిగతం. కానీ పరిశ్రమకి వచ్చినప్పుడు నేను ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా నేను పరిశ్రమకి చెందిన వాళ్ళం, అందుకని నేను దానిగురించి మాట్లాడలేను," అని చెప్పారు సురేష్ బాబు. చాలామంది ముఖ్యమంత్రులు పరిశ్రమకి చాలా చేశారు అని ఎన్టీఆర్ గారు చాలా చేశారు. చెన్నారెడ్డి గారు అయితే చాలా హెల్ప్ చేశారు, తరువాత ఎన్టీఆర్ గారు చేశారు. చంద్రబాబు గారు కూడా చిత్ర పరిశ్రమకి చాలానే చేశారు.
కానీ చిత్ర పరిశ్రమ స్పందించటం లేదు అన్నది కరెక్టు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయిడు అరెస్టు అనేది చాలా సున్నితమైన ఇష్యూ. ఆంధ్రా, తెలంగాణ గొడవలప్పుడు కూడా పరిశ్రమ నుండి ఎటువంటి స్పందన రాలేదు, ఎందుకంటే పరిశ్రమ ఎప్పుడూ రాజకీయ ప్రకటనలకు దూరంగా వుంది. వ్యక్తిగతంగా ఎవరైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు, కానీ పరిశ్రమ తరపున నాకు తెలిసి రాజాకీయంగా స్పందించటం సరికాదు అని అనుకుంటున్నాను అని సురేష్ బాబు చెప్పారు.