AkhilAkkineniAgent: బౌండ్ స్క్రిప్ట్ లేకుండా 'ఏజెంట్' స్టార్ట్ చేసాం, అందుకే ఫెయిల్ అయింది: నిర్మాత అనిల్ సుంకర
ABN, First Publish Date - 2023-05-01T16:44:38+05:30
నిర్మాత అనిల్ సుంకర మొదటి సారిగా నోరి విప్పి 'ఏజెంట్' సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పాడు. బౌండ్ స్క్రిప్ట్ లేకపోవటమే చేసిన పెద్ద తప్పు అని ట్వీట్ చేసాడు. సినిమా సరిగ్గా ఇవ్వలేకపోయినందుకు అందరినీ క్షమించమని వేడుకున్నాడు.
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటించిన 'ఏజెంట్' #Agent సినిమా విడుదల అయి మూడు రోజులయింది. సురేందర్ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించిన ఈ సినిమా అనిల్ సుంకర (Anil Sunkara) నిర్మించారు. ఈ సినిమా మొదటి రోజు మొదటి షో నుండే నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. రెండో రోజుకి ఈ సినిమా ఒక పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. ఇంత పెద్ద డిజాస్టర్ అవటం ఈమధ్య కాలం లో 'ఏజెంట్' సినిమా అనే చెప్పొచ్చు. సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్ పెట్టి, థియేట్రికల్ హక్కులు రూ. 37 కోట్ల వరకు అమ్మిన ఈ సినిమా కనీసం రెవిన్యూ ఏమీ లేకుండా డిజాస్టర్ అయింది.
ఈ సినిమా మీద అయినన్ని ట్రోల్స్ ఈమధ్య ఏ సినిమాకి అవలేదు. అఖిల్ అమ్మగారు అమల (Amala Akkineni) కూడా పాపం ట్రోల్స్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పుకోవలసి వచ్చింది అంటే, అంతలా ట్రోల్ చేశారు ఈ సినిమాని, అఖిల్ ని కూడా. ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఈ సినిమా మీద, కానీ ఆ నమ్మకం వమ్ము అయిపొయింది.
ఇప్పుడు మూడు రోజుల తరువాత ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర ఈ ఫెయిల్యూర్స్ కి రెస్పొంద్ అయ్యాడు. "ఏజెంట్ ఫెయిల్యూర్ కి మాదే బాధ్యత. మాకు తెలుసు ఈ సినిమా ఒక పెద్ద టాస్క్ తో కూడుకున్నది అని, కానీ ఫెయిల్ అయ్యాము, ఎందుకంటే ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడే మేము ఒక పెద్ద తప్పు చేసాము అదేంటి అంటే బౌండ్ స్క్రిప్ట్ తో వెళ్ళకపోవడం, తరువాత కోవిడ్ రావటం," అని చెప్పాడు అనిల్ సుంకర. ఇలా ఒక సాకు చెప్పి తప్పించుకోవటం మా ఉద్దేశ్యం కాదు, కానీ ఈ పెద్ద తప్పు నుండి నేర్చుకొని మళ్ళీ ముందు ముందు ఇటువంటి తప్పు చెయ్యకుండా చూసుకోవటానికి ట్రై చేస్తాము, అని చెప్పాడు. అలాగే వీళ్ళని నమ్మి ఈ సినిమా మీద ఆశ పెట్టుకున్న అందరికీ క్షమించమని వేడుకున్నాడు అనిల్. ఈ సినిమా కొచ్చిన లాస్ హార్డ్ వర్క్ చేసి ముందు ముందు చేసే ప్రాజెక్ట్ లతో పూరిస్తాం అని ట్వీట్ చేసాడు.