Mistake: కథపై నమ్మకంతో ‘మిస్టేక్’ చేశారంటోన్న ప్రియదర్శి
ABN, First Publish Date - 2023-07-31T20:48:05+05:30
‘రామ్ అసుర్’ తర్వాత అభినవ్ సర్దార్ నటించిన చిత్రం ‘మిస్టేక్’. కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించారు. ASP బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను ఆగస్ట్ 4న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను నటుడు, కమెడియన్ ప్రియదర్శి విడుదల చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
‘రామ్ అసుర్’ తర్వాత అభినవ్ సర్దార్ (Abhinav Sardhar) నటించిన చిత్రం ‘మిస్టేక్’ (Mistake). కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి (Bharath Kommalapati) దర్శకత్వం వహించారు. ASP బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను ఆగస్ట్ 4న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను నటుడు, కమెడియన్ ప్రియదర్శి (Priyadarshi) విడుదల చేశారు. పోస్టర్ విడుదల అనంతరం ప్రియదర్శి మాట్లాడుతూ.. అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూనే నిర్మాతగా ‘మిస్టేక్’ సినిమా చేశారు. మంచి కథపై నమ్మకంతో ఆయన నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 4న రిలీజ్ అవుతుంది. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. (Mistake Release Date)
అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. ఈ కథలో మంచి పాయింట్ ఉందనిపించింది. వెంటనే ‘మిస్టేక్’ సినిమాను మొదలు పెట్టాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ భరత్ కథ చెప్పగానే ఈ సినిమాకు ఓకే చెప్పాను. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి పేరు వచ్చింది. ఆగస్ట్ 4న వస్తోన్న ఈ మూవీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నామని తెలిపారు. (Mistake Telugu Movie)
డైరెక్టర్ సన్నీ అలియాస్ భరత్ కొమ్మాలపాటి మాట్లాడుతూ.. సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలను తెలుగు సినిమాల్లో రానటువంటి యూనిక్ స్టైల్లో డిజైన్ చేసి చిత్రీకరించాం. ఆ యాక్షన్ పార్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యూత్, ఫ్యామిలీ సహా అన్నీ వర్గాల ప్రేక్షకులను సినిమా మెప్పిస్తుంది. ఆగస్ట్ 4న వస్తున్న ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Navdeep: స్వామీ.. నదికి పోలేదా? అంటే.. ‘నదే సిటీకి వచ్చింది’ అంటూ ప్రభుత్వంపై పంచ్
**************************************
*S Thaman: సాయి తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధపడ్డానంటే..
**************************************
*Chandramukhi 2: రాజు వేషంలో లారెన్స్ ఫస్ట్ లుక్.. ఎలా ఉందంటే?
**************************************
*Brahmanandam: ఇదిగో సీఏం గారూ.. మా అబ్బాయి పెళ్లికి తప్పకుండా రావాలి
**************************************
*Sandeham: హెబ్బా పటేల్ ‘సందేహం’లో ‘చచ్చినా చావని ప్రేమిది’
**************************************