Adipurush: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తిరుపతిలో భారీగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ABN, First Publish Date - 2023-06-05T18:19:34+05:30
మొదటి ప్రచార చిత్రానికి వచ్చిన విమర్శల కారణంగా చాలా మార్పులు చేసి, రామాయణం ఆధారంగా తీసిన 'ఆదిపురుష్' సినిమా ఈనెల 16న విడుదల అవుతోంది. దీనికన్నా ముందుగా తిరుపతిలో రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక భారీగా చేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు.
ప్రభాస్ #Prabhas, కృతి సనన్ #KritiSanon జంటగా వస్తున్నా 'ఆదిపురుష్' #Adipurush సినిమా జూన్ 16న విడుదల అవుతోంది. దీనికి ఓం రౌత్ #OmRaut దర్శకుడు కాగా, ఈ సినిమా ప్రచార చిత్రాలకి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. రేపు మంగళవారం తిరుపతిలో (Tirupati) జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకకి కూడా అంతే భారీగా చెయ్యాలని చిత్ర నిర్వాహకులు భావించారు. ఇందుకోసం ఈ వేడుక జరగబోయే స్థలంలో రామ జన్మస్థలం అయిన అయోధ్య (Ayodhya) సెట్ ని భారీగా వేస్తున్నారు అని చెప్తున్నారు.
ఈ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలి కాలంలో చిత్రపరిశ్రమలో జరగనున్న బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలవబోతోంది అని నిర్వాహకులు అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా మొదటి సారి ట్రైలర్ ని విడుదల చేసినప్పుడు, చాలా విమర్శలు వచ్చాయి. వెంటనే చిత్ర నిర్వాహకులు అప్పుడు అనుకున్న తేదీకి విడుదల చెయ్యకుండా కొత్త తేదీ అయిన ఈనెల 16న విడుదల చేస్తున్నారు. ఆ విమర్శల తరువాత చాలా మార్పులు చేసారు అని అన్నారు కూడా.
అందుకే ఈ సినిమా ప్రచార చిత్రాలకు భారీగా ఖర్చుపెడుతున్నారు. దేశం అంతా ఈ చిత్ర నటీనటులు, దర్శకుడు, నిర్మాత తిరుగుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను కలుస్తూ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అలాగే రేపు తిరుపతిలో బ్రహ్మాండమైన ప్రీ రిలీజ్ వేడుకను చేస్తున్నారు. అందరికీ తెలిసిన రామాయణం తీయటం అంటే మాటలు కాదు, అందుకే మొదటి విడుదల చేసిన ప్రచార వీడియో కి అన్ని విమర్శలు వచ్చాయి. ఆలా రావటం వలన మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో విపరీతమైన శ్రద్ధ వహిస్తున్నారు అని కూడా అంటున్నారు. అంతేకాదు ఈ ప్రచారాన్ని చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు.
తిరుపతి లో కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందిన మత గురువు చిన జీయర్ స్వామి. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరగబోతున్న మరికొన్ని విషయాలు ఏంటంటే, ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. అలాగే తిరుపతిలో అయోధ్య యొక్క భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇక 'ఆదిపురుష్' మరియు రామాయణం పాటలకి ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ #PrashanthVarma ఈ ఈవెంట్ మొత్తంకి దర్శకత్వం వహిస్తున్నారు, అది ఆసక్తికరం. అలాగే ప్రముఖ యాంకర్ ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.