Prashanth Neel : హీరోగానే కాకుండా దర్శకుడిలా కూడా ఆలోచిస్తాడు
ABN, Publish Date - Dec 19 , 2023 | 06:42 PM
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'సలార్' (Salaar) గురించే చర్చ. ఆ సినిమాకు అంత క్రేజ్. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ చిత్రాలేవి అంతగా ఆకట్టుకోలేదు. దాంత ఈ చిత్రంపై ప్రేక్షకులు విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ (Prabhas) దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సంస్థపై విజయ్ కిరగంధూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన 'సలార్' (Salaar) గురించే చర్చ. ఆ సినిమాకు అంత క్రేజ్. బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ చిత్రాలేవి అంతగా ఆకట్టుకోలేదు. దాంత ఈ చిత్రంపై ప్రేక్షకులు విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ (Prabhas) దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సంస్థపై విజయ్ కిరగంధూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో అభిమానులు కోలాహలం చేస్తున్నారు. చిత్ర బృందం కూడా ప్రచారాలు ముమ్మరంగా చేస్తున్నాయి. శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో ‘సలార్’ రెండు భాగాలుగా తెరకెక్కింది.
తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పృథ్వీరాజ్ సుకుమారన్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘సలార్’లో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను సెకండ్ హీరోగా ఒప్పించడం కష్టమవుతుందేమో అనుకున్నా. కానీ, ఆయనకు స్క్రిప్ట్ నచ్చి వెంటనే ఓకే అన్నాడు. వరదరాజ మన్నార్ పాత్రలో ఒదిగిపోయే నటుడి కోసం చాలా కసరత్తు చేశాం. బాలీవుడ్ నటులను తీసుకోవాలని కొందరు సలహాలిచ్చారు. నేను మాత్రం పృథ్వీరాజ్‌నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ప్రేమ, ద్వేషం రెండూ చూపించగల నటుడు ఆయన. పృథ్వీ ఒక సన్నివేశాన్ని నటుడిలాగే కాకుండా దర్శకుడిలా కూడా ఆలోచిస్తాడు. ఆయనకు ఉత్తమ అసిస్టెంట్ డైరెక్టర్ అని బిరుదు ఇవ్వొచ్చు. ‘సలార్’ కోసం ఎన్నో ఆలోచనలు పంచుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన లేకపోతే ‘సలార్’ లేదు’’ అని ప్రశాంత్ నీల్ అన్నారు. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతీహాసన కథానాయికగా నటించింది.