సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

They Call Him OG: ‘ఓజి’ సెట్‌లో నందా!

ABN, First Publish Date - 2023-04-28T15:09:41+05:30

నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్‌.. (OG) ‘బద్రి’ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌తో పవన్‌ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. మళ్లీ కోర్డుకి వస్తావనుకోలేదు.. ఏం.. తిరిగొచ్చానని భయమా నీకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రీనాథ్‌.. (OG)

‘బద్రి’ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌తో పవన్‌ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌ ఇది.

మళ్లీ కోర్డుకి వస్తావనుకోలేదు..

ఏం.. తిరిగొచ్చానని భయమా నీకు..

వకీల్‌సాబ్‌.. ఓడిపోయే కేస్‌ ఒప్పుకున్నావ్‌.. ఓడిపోతావ్‌.. (Vakeel saab)

ఆశతో ఉన్నోడికే గెలుపోటములు ఉంటాయ్‌.. ఆశయం కోసం ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది...

నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా.. కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే.

వకీల్‌సాబ్‌లో పవన్‌కల్యాణ్‌కు - ప్రకాశ్‌రాజ్‌కు (Prakash raj) మధ్య సాగే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లివి. ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ తర్వాత ఈ కాంబినేషన్‌ సెట్‌ కావడానికి తొమ్మిదేళ్లు పట్టింది. ‘వకీల్‌సాబ్‌’తో మ్యాజిక్‌ చేసిన ఈ కాంబో మరోసారి రిపీట్‌ అవుతుంది.

పవన్‌కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజి’ (OG) చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. శుక్రవారం ప్రకాశ్‌రాజ్‌ సెట్‌లో అడుగుపెట్టారు. సినిమాకు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు (They call him OG). ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. ‘ఒజి’ చిత్రానికి సంబంధించి రోజుకో అప్‌డేట్‌ ఇస్తూ ఆసక్తి రేకెత్తిస్తోంది. (sujeeth)

నందా - బద్రి, రాంబాబు - రానా ప్రతాప్‌ నాయుడు, నందా - సత్యదేవ్‌ ఈ కాంబినేషన్స్‌ అన్ని ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ‘ఒజి’లో వీరిద్దరి కాంబినేషన్‌ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది. పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక ఆరుళ్‌ మోహన్‌ (Priyanka Arul mohan) కథానాయికగా నటిస్తోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-04-28T15:17:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!