సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Prabhas: మరోసారి వివాదంలో చిక్కుకున్న ‘ఆదిపురుష్’

ABN, First Publish Date - 2023-04-10T18:24:37+05:30

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కీలక పాత్ర పోషించిన సినిమా ఆదిపురుష్ (Adipurush). ఇతిహాస గ్రంథం రామాయణం ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కీలక పాత్ర పోషించిన సినిమా ఆదిపురుష్ (Adipurush). ఇతిహాస గ్రంథం రామాయణం ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆదిపురుష్’ లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ (Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటిస్తున్నారు. ఈ సినిమా అనేక కారణాల వల్ల వార్తల్లోనే ఉంటుంది. ఫస్ట్‌లుక్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు వెంటడుతూనే ఉన్నాయి. తాజాగా ప్రతీక్ సంఘర్ (Pratik Sanghar) అనే కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ‘ఆదిపురుష్’ టీం తన డిజైన్స్‌ను కాపీ చేసిందని ఆరోపించారు.

‘ఆదిపురుష్’ కు విజువల్ డిజైనర్‌గా పనిచేస్తున్న టీపీ. విజయన్ అనే వ్యక్తి తన వర్క్‌ను కాపీ చేశారని ప్రతీక్ సంఘర్ తెలిపారు. అందుకు సంబంధించి ఓ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నేను ఇండియాకు చెందిన కాన్సెప్ట్ ఆర్టిస్టుని. రామాయణం ఆధారంగా రాముడిని రూపాన్ని ఊహించి ఏడాది క్రితం అనేక స్కెచ్‌లు వేశాను. ‘ఆదిపురుష్’ కు కాన్సెప్ట్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నా ఆర్ట్ వర్క్‌ని చోరీ చేసి సొంతంగా చేశామని చెప్పుకుంటున్నారు. ఆర్ట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నట్టు నాకు సమాచారం ఇవ్వలేదు. నష్టపరిహారం కూడా చెల్లించలేదు. ఈ ప్రాజెక్టు వైఫల్యానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. ‘ఆదిపురుష్’ కు పనిచేస్తున్న వారిలో ప్రాజెక్టుపై అభిరుచి, ప్రేమ లేవు. అనేక చీప్ ట్రిక్స్‌ను ప్లే చేసి సినిమాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. ‘ఆదిపురుష్’ టీం చేసిన ఆర్ట్ వర్క్‌‌కు సంబంధించిన లింక్ ఇప్పటికి తీసేయలేదు. నా ఒరిజినల్ ఆర్ట్ వర్క్‌ను దానితో పోల్చి చూడండి. ‘ఆదిపురుష్’ ఆర్ట్ వర్క్‌ను నేను స్క్రీన్ షాట్‌లు తీశాను. ఎందుకంటే వారు దానిని తీసేసి ఏం జరగనట్టు నటిస్తారని నాకు తెలుసు’’ అని ప్రతీక్ సంఘర్ చెప్పారు.

‘ఆదిపురుష్’ సంక్రాంతికే విడుదల కావాలి. కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ బాగా లేని కారణంగా సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. ఫలితంగా చిత్రాన్ని జూన్ 16న విడుదల చేస్తామని చెప్పారు. రిలీజ్ డేట్ మారినప్పటికీ వివాదాలు మాత్రం చిత్రాన్ని వెంటడుతూనే ఉన్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Pawan Kalyan: పవర్ స్టార్ సినిమాకు సీక్వెల్!

Aadujeevitham: ఈ సినిమా కోసం చిరంజీవికి నో చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్.. ట్రైలర్‌‌ను వీక్షించారా..?

Allu Arjun: ‘వేర్ ఈజ్ పుష్ప’ ప్రమోషన్ వీడియోకు భారీ ఖర్చు..?

Jr NTR: భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్న తారక్!

Chor Nikal Ke Bhaga: ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును చెరిపేసిన బాలీవుడ్ సినిమా

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Updated Date - 2023-04-10T18:27:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!