Prabhas Srinu: ప్రభాస్‌తో చెడిందా?.. క్లారిటీ ఇచ్చిన శ్రీను!
ABN, First Publish Date - 2023-11-17T11:09:23+05:30
ప్రభాస్ శ్రీను (Prabhas Srinu).. పరిచయం అవసరంలేని నటుడు. కమెడీయన్ గా కెరీర్ ప్రారంభించి ప్రభాస్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. శ్రీను కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తయ్యాయి. తాజాగా ప్రభాస్ - శ్రీనులపై ఓ గాసిప్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య దూరం పెరిగిందనీ, ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రభాస్ శ్రీను స్పందించారు.
ప్రభాస్ శ్రీను (Prabhas Srinu).. పరిచయం అవసరంలేని నటుడు. కమెడీయన్ గా కెరీర్ ప్రారంభించి ప్రభాస్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. శ్రీను కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తయ్యాయి. ‘వర్షం’, ‘చక్రం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘డార్లింగ్’, ‘పౌర్ణమి’ తదితర చిత్రాల్లో ప్రభాస్‌తో కలిసి నటించారు. వారి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ (Prabhas) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీను. ఆయన ఏ విషయంలోనూ సలహా ఇవ్వరని, 'నువ్వెంటో ముందు తెలుసుకో.. దానిని బట్టి ముందు అడుగు వెయ్యి' అని మాత్రమే చెబుతారు’ అని అన్నారు. తాజాగా ప్రభాస్ - శ్రీనులపై ఓ గాసిప్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య దూరం పెరిగిందనీ, ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రభాస్ శ్రీను స్పందించారు. మా మధ్య అలాంటిది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. మా స్నేహం నదీ ప్రవాహంలా సాగుతుందని చెప్పారు
ఇంకా ఆయన మాట్లాడుతూ ''ప్రభాస్ ఎవరికీ సలహా ఇవ్వరు. అలా చేస్తే భయంతో పనిచేస్తావని, అలా చేయడం సరైందికాదని ప్రభాస్ నాకు తరచూ చెబుతుంటారు. అయితే రియలైజేషన్‌కు ఎక్కువ సమయం ఇస్తారు. ప్రభాస్‌కు నచ్చని కొన్ని అలవాట్లను మార్చుకున్నా. మా ఇద్దరి స్నేహం నదీ ప్రవాహంలా సాగుతుంది. వరుస సినిమాల చిత్రీకరణలతో ఇద్దరం బిజీగా ఉన్నాం’’ అని అన్నారు. ‘ఇతరుల మాట విని ప్రభాస్ మీపై కోప్పడిన సందర్భాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు తనకెప్పుడూ అలా అనిపించలేదన్నారు.
ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన ‘సలార్ పార్ట్ 1’ డిసెంబరు 22న విడుదల కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 ఏడీ’, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇవి పూర్తయ్యాక సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సి ఉంది.