Adipurush: ప్రభాస్, రాముడు రెండే వినపడుతున్నాయి, చరిత్ర సృష్టిస్తాడా...
ABN, First Publish Date - 2023-06-15T09:32:05+05:30
'ఆదిపురుష్' సినిమా ప్రీ-బుకింగ్స్ కూడా చరిత్ర సృష్టిస్తోంది. ఎందుకంటే ఏ సినిమాకి కూడా ఇలాంటి ప్రీ-బుకింగ్స్ రాలేదు అని అంటున్నారు. ప్రభాస్ ని మీసాల రాముడు అని కొంతమంది ఎగతాళిగా అంటున్నా ప్రేక్షకులు ఎగబడి టికెట్స్ కొంటున్నారు, ఓపెన్ చేసిన నిముషాల్లోనే అయిపోతున్నాయి టికెట్స్. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చ్రిర్త సృష్టిస్తాయని అంటున్నారు.
ప్రభాస్ (Prabhas) శ్రీరాముడిగా మొదటిసారిగా ఒక పౌరాణిక పాత్రలో కనపడనున్నాడు 'ఆదిపురుష్' #Adipurush సినిమాలో. రేపు థియేటర్స్ లో విడుదల అవుతోంది. #AdipurushOnJune16 ఇప్పటికే ఈ సినిమాకి కావాల్సినంత హైప్, క్రేజ్ రావటం వలన ఈ సినిమా ప్రీ-బుకింగ్స్ లో సునామీని తలపించేట్టుగా వున్నాయి. ఓం రౌత్ (OmRaut) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్ (KritiSanon) సీత పాత్రలో కనపడనుంది. చాలా సంవత్సరాల తరువాత భారతీయ చలన చిత్ర చరిత్రలో ఒక పౌరాణిక సినిమా, రామాయణ #Ramayanam కావ్యాన్ని ఆధారం చేసుకొని ఇంతలా, ప్రపంచం అంతా కనీవినీ ఎరుగని రీతిలో ఆ సినిమాకి ప్రీ-ఓపెనింగ్స్ రావటం ఇదే మొదటి సారి అని అంటున్నారు.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ప్రీ-బుకింగ్స్ రూ. 100 కోట్లకు పైగా దాటిపోయిందని ఈ లెక్కన చూసుకుంటే మొదటి రోజు ఓపెనింగ్స్ చరిత్ర సృష్టించే దిశగా ఉంటుందని చెపుతున్నారు ట్రేడ్ అనలిస్ట్స్. ప్రపంచ మొత్తంమీద మొదటి రోజు రూ200 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ముందు ముందు ఈ రికార్డ్స్ ని చెరిపేయటం అది అంత సులువు కాదని కూడా చెపుతున్నారు.
'ఆదిపురుష్' #Adipurush సినిమా బడ్జెట్ సుమారు రూ.500 కోట్ల వరకు అయిందని అంచనా. అయితే ఈ సినిమా బిజినెస్ కూడా అంతే లెవెల్లో అయిందని చెపుతున్నారు. ఒక్క తమిళ, మలయాళం భాషల్లో తప్పితే మిగతా అన్ని చోట్ల బుకింగ్స్ ఓపెన్ చెయ్యగానే నిముషాల్లోనే టికెట్స్ అయిపోయే పరిస్థితి ఉందని చెపుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ప్రభాస్ ఎవరికీ అందని రేంజ్ లోకి వెళ్ళిపోతాడు అని కూడా అంటున్నారు.
పౌరాణికం అనగానే తెలుగు సినిమాలే అందరికీ గుర్తుకు వస్తాయి. ఎందుకంటే తెలుగు చలన చిత్రసీమలో వచ్చినన్ని పౌరాణిక సినిమాలు మరెక్కడా రాలేదేమో ! ఎన్టీఆర్ (NTR), శోభన్ బాబు (SobhanBabu), కాంతారావు (KanthaRao), బాలకృష్ణ (NandamuriBalakrishna), హరనాథ్ (Haranath), రవికుమార్ (Ravikumar) ఇలా చాలామంది వేశారు, అలాగే హిందీ ధారావాహిక 'రామాయణం' లో అరుణ్ గోవిల్ (ArunGovil) రాముడిగా చాలా ప్రసిద్ధి పొందాడు. అయితే వీరెవరూ మీసం లేకుండానే నటించారు, కానీ ఇప్పుడు ప్రభాస్ కి మీసాల రాముడు అని కొంచెం ఎగతాళిగా అంటున్నా, రామాయణం తెలిసిన కథే అయినా, ఓపెనింగ్స్ చూస్తుంటే మాత్రం ఒక సునామీ సృష్టిస్తాడు అనే అనిపిస్తోంది. రాముడు పాత్ర ఎలా వున్నా రామాయణాన్ని ఎలా తీశారు, ప్రభాస్ రాముడిగా ఎలా కనిపించనున్నాడు అనే ఆసక్తితో ప్రేక్షకులు చూస్తారు అని అర్థం అవుతోంది.