కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prabhas : అప్పుడు ఫేస్‌బుక్‌.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్

ABN, First Publish Date - 2023-10-15T16:18:52+05:30

పాన్  ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పేరుతో సోషల్‌ మీడియా ఖాతాలు ఉన్నా ఆయన రేర్‌గా వాడుతుంటారు. ఆయన ఖాతాలో పోస్ట్‌ చూడాలంటే ఆయన నటించిన సినిమా విడుదల కావాలని, లేదా ప్రమోషన్  పనులు అయినా ఉండాలి. ప్రభాస్‌కు ఇన్స్టా, ఫేస్‌బుక్‌ ఖాతాలున్నాయి.

పాన్  ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పేరుతో సోషల్‌ మీడియా ఖాతాలు ఉన్నా ఆయన రేర్‌గా వాడుతుంటారు. ఆయన ఖాతాలో పోస్ట్‌ చూడాలంటే ఆయన నటించిన సినిమా విడుదల కావాలని, లేదా ప్రమోషన్  పనులు అయినా ఉండాలి. ప్రభాస్‌కు ఇన్స్టా, ఫేస్‌బుక్‌ ఖాతాలున్నాయి. వాటి ద్వారా ఆయన చిత్రాలు విశేషాలను పంచుకుంటారు. తాజాగా ప్రభాస్‌ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌ మిస్‌ అయింది. ఇన్‌స్టాలో ప్రభాస్‌ పేరును సెర్చ్‌ చేస్తుంటే ‘ఈ పేజీ అందుబాటులో లేదు’ అనే మెసేజ్‌ వస్తోంది. అయితే ఆయన ఖాతా హ్యాక్‌ అయిందా. లేదా డి-యాక్టివేట్‌ చేశారా.. అన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు.. ఈ విషయం పట్ల డార్లింగ్‌ ఫ్యాన్స అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మూడు నెలల క్రితం ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా కూడా హ్యాక్‌ గురైన సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్‌ సినిమాల సంగతికొస్తే ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్‌’ డిసెంబర్‌లో విడుదల కానుంది. వీటితోపాటు మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ చిత్రాల్లో ప్రభాస్‌ నటించనున్నారు.

Updated Date - 2023-10-15T16:24:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!