కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prabhas: చాలా రోజుల తరువాత హైదరాబాదులో ప్రభాస్..

ABN, First Publish Date - 2023-11-08T11:48:09+05:30

చాలా రోజులు ఇటలీలో విశ్రాంతి తీసుకొని రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు హైదరాబాదులో అడుగు పెట్టారు. దీనితో 'సలార్' సినిమా విడుదల తేదీ వాయిదా పడనుంది అనే వార్తలకి ఒక చెక్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.

Prabhas landed in Hyderabad after a trip to Italy

రెబల్ స్టార్ గా, డార్లింగ్ #Darling గా అభిమానులు పిలుచుకునే ప్రభాస్ (Prabhas) చాలా రోజుల తరువాత హైదరాబాదులో అడుగు పెట్టారు. ప్రభాస్ నటించిన 'సలార్' #Salaar సినిమా డిసెంబర్ 22న విడుదలకి సిద్ధంగా వుంది. ప్రశాంత్ నీల్ (PrashanthNeel) దీనికి దర్శకుడు. ఈ సినిమా అనేకసార్లు వాయిదా పది చివరికి డిసెంబర్ 22 తేదీ ఖరారు చేశారు. అయితే గత కొన్ని రోజుల నుండి ఈ తేదీకి కూడా ఈ సినిమా విడుదల కాదు, మళ్ళీ వాయిదా పడే అవకాశాలు వున్నాయి అని సాంఘీక మాధ్యమంలో వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్ హైదరాబాదు రావటంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది. ఈ సినిమా అనుకున్నట్టుగానే డిసెంబర్ 22 న విడుదల సిద్ధం అవుతోందని ప్రభాస్ రాకతో తెలియపర్చినట్టు అయింది. #SalaarCeaseFireOnDec22 ఈ సినిమాలో ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉందని, ఆ రెండు పాటలు రామోజీ ఫిలిం సిటీ (RamojiFilmCity) లో త్వరలో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ప్రభాస్ కాలుకి సర్జరీ అయిందని, అందుకనే అతని చాలా కాలం ఇటలీలో విశ్రాంతి తీసుకొని ఇప్పుడు హైదరాబాదులో అడుగు పెట్టారు అని తెలుస్తోంది.

ప్రభాస్ 'సలార్' సినిమా విడుదలప్పుడే షా రుఖ్ ఖాన్ (ShahRukhKhan) 'డంకి' #Dunkiసినిమా కూడా విడుదలవుతోంది. ఇలా ఇద్దరి అగ్ర నటుల సినిమాలు ఒకే రోజు విడుదలవడం కొంచెం ఆసక్తికరంగా వుంది. ఎందుకంటే 'సలార్' అన్ని భాషల్లో విడుదలవుతోంది, అలాగే 'డంకి' కూడా. 'సలార్' లో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయిక, మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ (PrudhvirajSukumaran), జగపతి బాబు (JagapathiBabu), శ్రీయ రెడ్డి (SriyaReddy) మున్నగు నటులు వున్నారు.

Updated Date - 2023-11-08T11:48:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!