సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Poorna: అవును.. తల్లయింది!

ABN, First Publish Date - 2023-04-04T15:57:59+05:30

మలయాళ బ్యూటీ పూర్ణ (షమ్నా కాశీం) తల్లి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నాం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలయాళ బ్యూటీ పూర్ణ (షమ్నా కాశీం) (Poorna) తల్లి అయ్యారు. మంగళవారం మధ్యాహ్నాం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కేరళలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆమెకు పురుడు పోసిన వైద్యురాలు ఫాతిమా ఆమె బృందానికి పూర్ణ కృతజ్ఞతలు తెలిపారు. ((Poorna Blessed with baby boy) ) వైద్యబృందంతో పూర్ణ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసిన అభిమానులు పూర్ణకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మలయాళంలో కథానాయికగా కెరీర్‌ మొదలుపెట్టిన పూర్ణ.. ‘సీమ టపాకాయ్‌’ (seema tapakay)చిత్రంతో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమయ్యారు. రవిబాబు ‘అవును’ (avunu) చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. ‘శ్రీమంతుడు’ వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లోనూ కనిపించారు. తెలుగు టీవీ రియాలిటీ షోల్లో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. గతేడాది షాహిద్‌ ఆసిఫ్‌ అలీతో ఆమె వివాహం జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో కథానాయికగా కొనసాగుతూనే ‘ఢీ’ వంటి డాన్స్‌ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-04-04T16:21:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!