సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Ponniyin Selvan 2: రెండో పాట ఎలా ఉందో తెలుసా!

ABN, First Publish Date - 2023-03-21T17:27:03+05:30

‘ఆగనందే.. ‘ఆగనందే ఆగనందే.. (Aganande Aganande) మోవి నవ్వుతోందే.. మోవి నవ్వే.. మోవి నవ్వే.. మోము నవ్వుతోందే.. మోము నవ్వే.. మోము నవ్వే.. మాను నవ్వుతోందే’ అని పాడుకుంటున్నారు యువరాణి కుందై.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆగనందే.. ‘ఆగనందే ఆగనందే.. (Aganande Aganande) మోవి నవ్వుతోందే.. మోవి నవ్వే.. మోవి నవ్వే.. మోము నవ్వుతోందే.. మోము నవ్వే.. మోము నవ్వే.. మాను నవ్వుతోందే’ అని పాడుకుంటున్నారు యువరాణి కుందై. తన ప్రియుడు వందియ దేవన్‌ కోసమే ఈ పాట వేసుకుంది కుందై. విక్రమ్‌(Vikram), ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్‌, త్రిష తదితరులు కీలక పాత్రధారులుగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’లోని (Ponniyin Selvan: 2)పాట ఇది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ కథలో త్రిష కుందవైగా, వందియ దేవన్‌గా కార్తీ నటించారు. ఈ ఇద్దరి మధ్య సాగే ఈ పాటను సోమవారం విడుదల చేశారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించారు. శక్తి శ్రీ గోపాలన్‌ ఆలపించారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 28న విడుదల కానుంది.

Updated Date - 2023-03-21T17:27:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!