కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sankranti: ఈసారి సంక్రాంతి మ‌రింత రంజుగా.. రేసులోకి ధ‌నుష్

ABN, First Publish Date - 2023-11-08T20:28:16+05:30

సౌత్‌లో సినిమాల విడుద‌ల‌కు సంక్రాంతి ముఖ్య‌మైన రోజు. చాలా మంది హీరోలు ఆ రోజే త‌మ సినిమాల‌ను విడుద‌ల చేయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతుంటారు. కానీ ఈసారి ప‌రిస్థితి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చేలా ఉంది.

pongal movies

సౌత్‌లో సినిమాల విడుద‌ల‌కు సంక్రాంతి(Sankranti) ముఖ్య‌మైన రోజు.చాలామంది హీరోలు ఆ రోజే త‌మ సినిమాల‌ను విడుద‌ల చేయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతుంటారు. ఈక్ర‌మంలోనే సంక్రాంతి పండుగ స‌మ‌యంలో విడుద‌లైన‌న్ని సినిమాలు మ‌రో రోజు విడుద‌ల కావు. కానీ ఈసారి ప‌రిస్థితి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చేలా ఉంది. ఇప్ప‌టికే తెలుగులో పండుగ సంద‌ర్భంగా విడుద‌ల‌వ‌బోతున్న సినిమాల సంఖ్య ఆర డ‌జ‌నుకు పైగా ఉంది.

2024 సంక్రాంతికి మ‌హేశ్‌బాబు గుంటూరుకారం(Guntur Kaaram), వెంక‌టేశ్ సైంధవ్ (Saindhav), ర‌వితేజ ఈగ‌ల్ (Eagle), నాగార్జున నా సామిరంగా, తేజ , ప్రశాంత్ వ‌ర్మ పాన్ ఇండియా చిత్రం హ‌నుమాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్,శివ కార్తికేయ‌న్ అయ‌లాన్‌, వంటి స్టార్ల సిన‌మాలు త‌మ విడుద‌ల తేదీల‌ను అల్రేడీ ప్ర‌క‌టించి రిలీజ్‌కు స‌న్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు ధ‌నుష్ చిత్రం కెప్టెన్ మిల్ల‌ర్ కూడా చేర‌డంతో నిర్మాత‌లు త‌ల‌లు ప‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.


ధ‌నుష్ త‌మిళ న‌టుడైన‌ప్ప‌టికీ త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈక్ర‌మంలో మ‌న ద‌గ్గ‌ర‌ ఫ్యాన్ బేస్ పెంచుకుని స్ట్రెయిట్‌గా తెలుగు సినిమా ‘సార్’ చేసి విజ‌యం సాధించి ఇక్క‌డి న‌టుల‌తో క‌లిసిపోయారు. మ‌రో రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు కూడా. అయితే ధ‌నుష్ కెప్టెన్ మిల్ల‌ర్ (Captain Miller) చిత్రంపై ఇప్ప‌టికే అంచ‌నాలు ఓరేంజ్‌లో ఉన్నాయి.

ఈ డిసెంబ‌ర్‌లోనే విడుద‌ల కావాల్సి ఉన్న ఈ సినిమా ఇలా అనుహ్యంగా తెర‌మీద‌కు రావ‌డంతో ఇప్పుడు ఎవ‌రు వెనుకకు త‌గ్గుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. థియేట‌ర్లో ఏ సినిమా మంచిగా ఆడగుతుందో అని అనుకునే బ‌దులు అస‌లు పండుగ‌కు ఏ సినిమా విడుద‌లౌతుంది, ఎవ‌రు త‌గ్గుతారో అని సినీ అభిమానులు ఆలోచించే విచిత్ర ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Updated Date - 2023-11-08T20:34:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!