సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Mangalavaaram: శైలజా లుక్‌ చూస్తే... హా.. అనాల్సిందే!

ABN, First Publish Date - 2023-04-25T11:24:02+05:30

‘ఆర్‌ఎక్స్‌100’(RX100) ఫేం అజయ్‌ భూపతి (ajay Bhupati) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మంగళవారం’(Mangalavaaram). తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆర్‌ఎక్స్‌100’(RX100) ఫేం అజయ్‌ భూపతి (ajay Bhupati) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మంగళవారం’(Mangalavaaram). తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోంది. స్వాతి గునుపాటి. సురేశ్‌ వర్మ.ఎం నిర్మాతలు. పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal rajputh) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం హీరోయిన్‌ పాత్రను పరిచయం చేస్తూ వెల్లడించారు. ఈ మేరక్‌ పాయల్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఆర్‌ఎక్స్‌100 హిట్‌ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. ‘మంగళవారం’ సినిమాలో శైలజ పాత్రలో పాయల్‌ నటిస్తున్నట్లు తెలిపారు. ఆ లుక్‌లో పాయల్‌ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలు పోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్‌ అండ్‌ బోల్డ్‌ లుక్‌ అని చెప్పవచ్చు.

అజయ్‌ భూపతి మాట్లాడుతూ ‘‘1990వ దశకంలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. నేటివిటీతో కూడిప డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌. రా అండ్‌ రస్టిక్‌ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్‌ క్యారెక్టరైజేషన్‌ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్‌ సినిమా. సినిమాలో 30 పాత్రలున్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాధాన్యం కనిపిస్తుంది.

నిర్మాతలు స్వాతి గునుపాటి. సురేశ్‌ వర్మ.ఎం మాట్లాడుతూ ‘’అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ఎక్స్‌ 100’లో ఇందు పాత్ర ప్రేక్షకులకు ఎలా గుర్తు ఉండిపోతుందో, ఇప్పుడీ ‘మంగళవారం’లో శైలజ పాత్ర కూడా అలాగే గుర్తు ఉంటుంది. 75 రోజులు షూటింగ్‌ చేశాం. వచ్చే నెలలో ఆఖరి షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నాం. కాంతార’ ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు’’ అని చెప్పారు.

Updated Date - 2023-04-25T11:36:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!