Payal Rajput: బోల్డ్ మూవీ అంటున్నారు కానీ.. సినిమా చూస్తేనే అందులో ఉందేంటో తెలుస్తుంది
ABN, First Publish Date - 2023-11-22T13:38:31+05:30
‘RX100’ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటించారు. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్లపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. నవంబర్ 17న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ని సొంతం చేసుకోవడంతో.. చిత్ర బృందం సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది. తాజాగా విజయవాడలో ఈ యూనిట్ సందడి చేసింది.
‘RX100’ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’ (Mangalavaaram). పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), అజ్మల్ అమీర్ జంటగా నటించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్లపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను రాబట్టుకుని.. విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ప్రముఖ హోటల్లో చిత్ర బృందం సందడి చేసింది. (Mangalavaaram Success Tour at Vijayawada)
ఈ కార్యక్రమంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Heroine Payal Rajput) మాట్లాడుతూ.. ‘‘మంగళవారం చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఎంతో ఛాలెంజింగ్‌గా నేను నటించాను. డైరెక్టర్ ఈ కథ గురించి చెప్పినప్పుడు శైలజ పాత్రలో నటించడానికి ఆలోచించాను. నిజంగా ఇలాంటి పాత్ర చేయడానికి చాలా గట్స్ కావాలి. కథ విన్న తర్వాత ఈ పాత్ర చేయడానికి మొదట మా అమ్మ అనుమతి కోరా. ఆమె వెంటనే అనుమతి ఇచ్చారు. అమ్మ ఓకే అనగానే చాలా సంతోషంగా అనిపించింది. గ్రామీణ వాతావరణంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. మహిళా ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని బోల్డ్ మూవీ అనుకుంటున్నారు. ఈ సినిమా చూస్తేగాని.. సినిమా యొక్క విలువ తెలుస్తుంది. ఈ చిత్రంలో అసభ్యకర సన్నివేశాలు ఏమీ లేవు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం. త్వరలో ‘మంగళవారం 2’ సెట్స్ మీదకి రానుంది’’ అని తెలిపారు.
డైరెక్టర్ అజయ్ భూపతి (Director Ajay Bhupathi) మాట్లాడుతూ.. ‘‘ఆర్ఎక్స్ 100 తర్వాత అంతటి ఘనవిజయం ఈ చిత్రానికి లభించింది. ఇందులో ప్రతి సన్నివేశం ఒక ట్విస్ట్‌గానే ఉంటుంది. చివరి 40 నిమిషాలు ఉత్కంఠ కలిగించేలా చేస్తాయి. ప్రతి ఒక్కరికీ ఒళ్లు గగుర్పొడిచేలా సన్నివేశాలు ఉన్నాయి. పాయల్ రాజ్‌పుత్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్‌లా నిలిచారు. ఈ సినిమాలో నటించిన ఆవిడ గట్స్‌కి హాట్సాఫ్ చెబుతున్నాను. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ ఈ చిత్రానికి ప్రాణం పోశారు. లక్ష్మణ్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు విజయోత్సవ యాత్రను చేపట్టాము. ప్రతి థియేటర్లో ప్రేక్షకులు నుండి వస్తున్న స్పందనను మరువలేము. ‘మంగళవారం2’ చిత్రాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Kaathal The Core: రెండు దేశాల్లో మమ్ముట్టి, జ్యోతికల చిత్రం బ్యాన్.. ఎందుకంటే?
*******************************
*Dil Raju: మా ఆవిడ చెప్పే వరకు తెలియదు.. మా 16 నెలల అబ్బాయికి ఆ పాట పెట్టాల్సిందే
*****************************
*Pro Kabaddi: క్రికెట్ హంగామా ముగిసింది.. ఇప్పుడిదే సీజన్.. బాలయ్య తొడగొట్టేశాడు
*****************************