సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: నీ దగ్గర ఎప్పుడూ లేదంటావే... అదే నేను!

ABN, First Publish Date - 2023-07-22T18:20:08+05:30

పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘బో’. సముద్రఖని దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.

పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) సాయిధరమ్‌ (Sai tej)తేజ్‌ కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని (Samuthirakani) దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.

పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘బో’. సముద్రఖని దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.

‘భస్మాసురుడు అని ఒకడుంటాడు తెలుసా.. మీ మనుషులందరూ వాడి వారసులు.. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు.. ఎవడికీ ఛాన్స్‌ ఇవ్వరు’ అంటూ పవన్‌కల్యాణ్‌ డైలాగ్‌తో మొదలైంది ట్రైలర్‌. ‘టైమ్‌ లేదు టైమ్‌ లేదు’ అంటూ తన పనులతో బిజీగా కనిపించాడు సాయిధరమ్‌ తేజ్‌. ఇందులో పవన్‌కల్యాణ్‌ ఒక్కోసారి ఒక్కో లుక్‌లో కనిపించారు.

‘అందరూ టైమ్‌లో ముందుకెళ్తుంటారు.. నువ్వొక్కడివే టైమ్‌లో వెనక్కి వెళ్తున్నావ్‌’ అంటూ పవన్‌ చెప్పిన డైలాగ్‌లు,

‘చచ్చి బతికిపోయానన్నమాట.. అనవసరంగా బతికి చచ్చాను’ అంటూ తేజ్‌ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.

‘వస్తున్న టెంపో ఏంటి.. నువ్వు చేస్తున్న స్టెప్‌ ఏంటి? తకిటతకిటత 68 స్ఫూఫ్‌ సీన్‌ వినోదాన్ని పంచుతుంది. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ మధ్య సన్నివేశాలు సంభాషణలు, తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి. పవన్‌, తేజ్‌ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతోనూ ఈ చిత్రాన్ని రూపొందినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. పవన్‌కల్యాణ్‌ ‘జల్సా’(Jalsa) సినిమా స్టెప్‌ థియేటర్‌లో విజిల్స్‌ మోతమోగించేలా ఉంది. ఈ చిత్రానికి టి.జి విశ్వప్రసాద్‌ నిర్మాత. త్రివిక్రమ్‌ (Trivikram) మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు.

Updated Date - 2023-07-22T19:36:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!