Pawan kayan -Sujeeth: గ్యాంగ్‌స్టర్ ఆట మొదలైంది!
ABN, First Publish Date - 2023-01-30T16:19:58+05:30
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే! డి.వి.వి దానయ్య నిర్మాణంలో ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan kayan)కథానాయకుడిగా సుజీత్ (Sujeeth)దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే! డి.వి.వి దానయ్య (DVV Danayya)నిర్మాణంలో ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేశ్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. అల్లు అరవింద్, దిల్ రాజు చిత్ర దర్శక నిర్మాతలకు స్ర్కిప్ట్ అందజేశారు. (pawan kayan new movie launch)
‘‘పవన్‌కల్యాణ్ ఇమేజ్‌కి సరిపడా కథతో యాక్షన్ డ్రామాగా సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తమన్ సంగీతం, అద్భుతమైన సాంకేతిక నిపుణుల పనితీరుతో అటు పవన్‌కల్యాణ్ అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు పండుగలా ఈ చిత్రం ఉంటుంది’’ అని నిర్మాత డి.వి.వి.దానయ్య చెప్పారు. ఈ చిత్రానికి ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
వకీల్‌సాబ్, భీమ్లానాయక్ తర్వాత పవన్ చిత్రానికి మరోసారి పని చేస్తున్నారు తమన్. సుజిత్‌తో దిగిన ఓ ఫొటోని తమన్ షేర్ చేసి ‘‘మేము మొదలు పెట్టేశాం’’ అని పేర్కొన్నారు.
ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏఎం రత్నం, దిల్ రాజు, కె యల్. నారాయణ, కెఎల్ దామోదర ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, జెమిని కిరణ్, కృష్ణ, పీడీవీ ప్రసాద్, కార్తికేయ, దర్శకులు హరీష్ శంకర్, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, కోనవెంకట్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, నర్రా శ్రీనివాస్ తదితరులు చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.