సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan kalyan: నేను కోరుకున్న జీవితం కాదిది!

ABN, First Publish Date - 2023-07-26T00:28:52+05:30

పవన్‌కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కీలక పాత్రధారులుగా సముద్రఖని దర్శకత్వం వహించిన చిత్రంం ‘బ్రో’. జీ స్టూడియోతో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం రాత్రి శిల్పకళా వేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది.

పవన్‌కల్యాణ్‌(Pawan kalyan), సాయిధరమ్‌ తేజ్‌(Sai tej) కీలక పాత్రధారులుగా సముద్రఖని దర్శకత్వం వహించిన చిత్రంం ‘బ్రో’(Bro). జీ స్టూడియోతో కలిసి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం రాత్రి శిల్పకళా వేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది.

పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ఇంత అభిమానం, ప్రేమ సినిమానే నాకు ఇచ్చింది. అప్పుడప్పుడూ ఇది కల, నిజమా అనిపిస్తుంటుంది. ఇది నేను కోరుకున్న జీవితం కాదు. భగవంతుడు ఇచ్చిన జీవితం. చిన్నగా జీవితం ఉండాలనుకున్నానంతే. నటుణ్ణి కావాలనీ, రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోలేదు. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను వ్యవసాయం చేసుకుంటూ బతకాలనుకున్నా. మా వదిన చేసిన పనితో హీరోనయ్యా. అది మా వదిన నమ్మకం. నా పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలను మాటల్లో వర్ణించలేను. నా ప్రతి సినిమా ద్వారా సమాజానికి ఏదొకటి ఇవ్వాలనుకుంటా. ఇది అలాంటి సినిమానే. సంపూర్ణమైన సినిమా. నేను 70 రోజులు షూటింగ్‌ చేయాల్సిన సినిమా ఇది. నా పొలిటికల్‌ షెడ్యూల్‌ను బట్టి నిర్మాతలు, దర్శకుడి ప్రణాళికతో అతి తక్కువ సమయంలో సినిమా పూర్తి చేశారు. ఈ చిత్రంలో నేను 80 శాతం కనిపిస్తాను. రోజుకు ఎనిమిది గంటలపాటు 21 రోజులు చేశా. లేదంటే ఇంకా సెట్‌ వర్క్‌ చేస్తూనే ఉండేవాణ్ణి. టీమంతా చాలా కష్టపడ్డాం. తమన్‌తో ఇది హ్యాట్రిక్‌ సినిమా. ఈ కథ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. నవ్వుతూ ఏడిపిస్తుంది. చక్కని వినోదాన్ని పంచుతుంది.’ అని పవన్‌ అన్నారు.

చెంపపెట్టులా అనిపించింది...

కరోనా సమయంలో ఎటూ వెళ్లలేక రాజకీయాల్లో ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మిత్రుడు త్రివిక్రమ్‌ ఫోన్‌ చేసి సముద్రఖని దగ్గర మంచి కథ ఉంది, మీరు చేస్తే బావుంటుందని చెప్పారు. అలా అంగీకరించిన సినిమా ఇది. నేను ఏ సినిమా చేసినా రచయిత, దర్శకుడిని సంపూర్ణంగా నమ్మేస్తా. ఏం చేశాం అన్నది కూడా మానిటర్‌లో చూడను. వాళ్లపై పెట్టే నమ్మకం అలా ఉంటుంది. సముద్రఖని రాసిన మూల కథకి త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రాశారు. ఈ సినిమాతో సముద్రఖనికి అభిమానిని అయిపోయా. ఎందుకంటే ఈ చిత్రం కోసం ఆయన తెలుగు చదవడం నేర్చుకున్నారు. మాతృభాష అయిన మనమే నాలుగు లైన్లతో ఇంగ్లిష్‌ లేకుండా మాట్లాడలేం. సముదఖనిది మన భాష, యాస కాదు. ఆయన తెలుగు స్ర్కిప్ట్‌ చదువుతున్నాడు. తెలుగు వారై తెలుగులో స్పష్టంగా మాట్లాడని చాలామందికి చెంపపెట్టులా అనిపించింది. మన భాష నేర్చుకుని ఆయన కనువిప్పు కలిగించారు. తెలుగు భాష గొప్పతనం సాహిత్యం కరెక్ట్‌గా పట్టుకోగలిగే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. నేను ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లా డాన్స్‌ చేయలేకపోవచ్చు. ప్రభాస్‌, రానాలాగా బలమైన పాత్రలు చేయలేకపోవచ్చు. కానీ సినిమా అంటే నాకు ఇష్టం. సమాజం అంటే బాధ్యత. రాజకీయం, సినిమా ఏ ఒక్కరిదీ కాదు. అందరిది. మీరు బలంగా అనుకుంటే ఇక్కడ ఏదైనా సాధించగలరు. మేమంతా దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాం. అన్నయ్య చిరంజీవిగారు సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎవరి అండా లేదు. ‘నువ్వు హీరో అవుతావా’ అంటే నాకు భయమేసింది. నేను ఆయన తమ్ముడిగా వచ్చినా రెట్టింపు కష్టపడితేనే ఇక్కడ నిలబడగలం అన్న క్లారిటీతోనే వచ్చా. అలాగే కష్టపడి ఎదిగాం. నాకు హీరో అంటే మా అన్నయ్యే. ఇంకా అభిమాన హీరో ఎవరంటే కృష్ణగారి పేరు చెబుతా. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ పెద్ద తరహా నటులు. ఎప్పుడూ నన్ను నేను హీరోగా ఊహించుకోలేదు’’ అని అన్నారు.


మా వదిన చేసిన ద్రోహం (నవ్వుతూ) (Surekha Konidela)

నేను సినిమాల్లోకి రావాలనుకోలేదు. అన్నయ్య హీరో అవుతావా అని ఓసారి అడిగారు. మా వదిన మాత్రం వెళ్తే బావుంటుంది అని నన్ను సినిమాల్లోకి నెట్టింది. ‘సుస్వాగతం’ సినిమాలో ఓ పాట కోసం జగదాంబ సెంటర్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్‌ ఎక్కించి డాన్స్‌ చేయమన్నారు. సిగ్గుతో చచ్చిపోయా. దీనంతటికి కారణం మా వదిన. వెంటనే మా వదినకు ఫోన్‌ చేసి ‘ఎందకు నన్ను సినిమాల్లో పంపావు’ అని అడిగా. వదిన చేసిన తప్పు ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఆమె చేసిన ద్రోహాన్ని మాటల్లో చెప్పలేను(నవ్వుతూ) నేను చిరంజీవిగారి తమ్ముణ్ణి అని గ్రాంట్‌గా తీసుకోలేదు. కష్టపడాలని ముందే నిర్ణయించుకున్నా. నేను చాలా మొరటి మనిషిని. పైకి సన్నగా కనిపిస్తానేమో కానీ లోపల చిన్నపాటి బలమైన రైతు ఉంటాడు. చేసే పనిని త్రికరణశుద్ధితో చేస్తా. జయాపజయాలు సహజం. మేమంతా సినిమాల కోసం గొడ్డు చాకిరి చేస్తాం. దెబ్బలు తింటాం. నష్టాలోస్తే తీసుకుంటాం. అండగా నిలబడతాం. దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన మేమే ఇంత చేయగలిగే మీరంతా ఇంకా ఎక్కువ చేయగలరు.

యువతరం అది ముందుకు తీసుకెళ్లాలి... (Rajmouli)

భాష విషయంలో త్రివిక్రమ్‌ మహాపండితుడు. తెలుగు భాష మీద ఆయన్ని ప్రేరణ తీసుకుని యువ రచయితలు రావాలి. మరెన్నో మంచి చిత్రాలు తీయాలి. రాజమౌళి తెలుగు సినిమాను హాలీవుడ్‌ దాకా తీసుకెళ్తారు. ఈ తరం దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అది పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్తుంది. నేను అందరి హీరోల అభిమానులను ఇష్టపడతా. ఒక్కో హీరో సినిమా చేస్తే ఎంతోమందికి ఉపాది దొరుకుతుంది. సినిమా చేసేటప్పుడు మాత్రం అందరికంట నా సినిమా పెద్ద హిట్‌ కొట్టాలని అనుకుంటా. ఈ విషయంలో కాంప్రమైజ్‌ కాను. ఇండస్ట్రీలో, నటుల మధ్య పోటీ ఉండాలి. అది స్నేహభావం పోకుండా ఉండాలి. ఆ తర్వాత జయాపజయాలు ప్రేక్షకులు ఇచ్చే తీర్పు మీద ఉంటుంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటా. హీరోల్లో చిన్న, పెద్ద అనేది భావన మాత్రమే.

డాక్టర్లు ఏమీ చెప్పలేకపోయారు..

ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌ నటించడానికి త్రివిక్రమ్‌ కారణం. ఈ కథ అనుకున్నప్పుడు ఆయనే సముద్రఖనికి తేజ్‌ని సూచించారు. అయితే అప్పటికీ తేజ్‌ ప్రమాదం జరిగి కోమాలో ఉన్నాడు. డాక్టర్లు ఏమాత్రం నమ్మకం చెప్పలేకపోయారు. కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు అని చెప్పా. అయినా వెయిట్‌ చేశారు. కోలుకున్నాక తేజ్‌ మాట్లాడలేకపోయాడు. సముద్రఖని స్పీచ్‌ థెరపి ఇప్పించి సినిమాలో చేయించారు. తేజ్‌ బెడ్‌ మీద ఉన్నప్పుడు నేను నమ్మే వారిని ఒకటే కోరుకున్నా. వాడికి చాలా భవిష్యత్తు ఉంది. వాడిని బతికించు అని ప్రార్థించానంతే. ఆ సమయంలో సినిమాల్లోలాగా గుళ్లకు వెళ్లలేం.. వ్రతాలు చేయలేం. మంచి జరగాలని కోరుకోవడం తప్ప. ఈ రోజున తేజ్‌ ఇలా ఉన్నాడు అంటే ఆ రోజున రోడ్డు మీద పడి ఉన్న తనను ఆస్పత్రిలో చేర్పిన అబ్దుల్‌ కారణం. అతన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. అతని కృతజ్ఞతలు.

Updated Date - 2023-07-26T00:55:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!