సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: టి.జి.గీతాంజలిగారి ఆత్మకు శాంతి చేకూరాలి

ABN, First Publish Date - 2023-06-30T21:56:01+05:30

‘‘సినీ నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్‌గారి మాతృమూర్తి శ్రీమతి గీతాంజలిగారు శివైక్యం చెందారని తెలిసి చింతించాను. గీతాంజలిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. విశ్వ ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను..’’ అని.. తన నిర్మాత మదర్‌కి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాళులు అర్పించారు.

TG Geethanjali and Pawan Kalyan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘సినీ నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్‌గారి మాతృమూర్తి శ్రీమతి గీతాంజలిగారు శివైక్యం చెందారని తెలిసి చింతించాను. గీతాంజలిగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. విశ్వ ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను..’’ అని.. తన నిర్మాత మదర్‌కి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాళులు అర్పించారు. నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్‌ ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా ‘బ్రో’ అనే చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. అసలు విషయం ఏమిటంటే..

సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధినేత టి.జి. విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) మాతృమూర్తి శ్రీమతి టి.జి గీతాంజలి (70) (Geethanjali) ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 6.10 నిమిషాలకు శివైక్యం చెందారు. గత కొంత కాలంగా అస్వస్థతతో బెంగళూరు‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకోలేని పరిస్థితుల కారణంగా తల్లి (TG Vishwa Prasad Mother Geethanjali) చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి (Varanasi) తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం, ఈరోజు ఆవిడ తుది శ్వాస విడిచారు. గీతాంజలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*M Prabhakar Reddy: చిత్రపురి కాలనీలో విగ్రహావిష్కరణ.. ఎప్పుడంటే?


**************************************

*D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం


**************************************

*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!


**************************************

*Maamannan: చివరి నిమిషంలో తొలగిన కోర్టు చిక్కులు.. టాక్ ఏంటంటే?

**************************************

*Bro Teaser Talk: మామ అల్లుళ్ళ మాస్ ర్యాగింగ్..


**************************************

*Chandramukhi 2: ‘చంద్రముఖి-2’ విడుదల ఎప్పుడంటే..


**************************************

Updated Date - 2023-06-30T21:56:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!