సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: ఒక్కమాటతో అందరినీ పడేసాడు

ABN, First Publish Date - 2023-06-22T13:27:14+05:30

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక స్ట్రాటజీ తో వెళుతున్నట్టు కనపడుతోంది. ఇంతవరకు జనసేన పార్టీ అంటే అతని అభిమానులు అనుకునేవారు, ఇప్పుడు అందరి నటుల అభిమానాన్ని ఒక్క మాటతో చూరగొంటున్నారు. అదీ పవన్ కళ్యాణ్ అంటే...

Pawan Kalyan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవన్ కళ్యాణ్ (PawanKalyan) ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ పర్యటనలు చేస్తున్నాడు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చాలా బాగున్నాయని, అలాగే ఎక్కడికి వెళ్లినా స్థానిక సమస్యలని బాగా లేవనెత్తి ప్రభుత్వానికి ప్రశ్నల బాణాలు సంధిస్తున్నాడని అంటున్నారు. అలాగే నిన్న ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ అన్న ఒక్క మాటతో తెలుగు పరిశ్రమలో వున్న అగ్రనటుల అభిమానుల అందరినీ కలిపేసుకున్నాడు అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ అంటే, అతనికి ఎటువంటి ఇగో లేదు అని, అతను ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతాడు అని అంటున్నారు.

ఇంతకీ పవన్ కళ్యాణ్ అన్న ఆ ఒక్క మాట ఏంటంటే. ప్రభాస్ (Prabhas), మహేష్ బాబులు (MaheshBabu) నా కన్నా పెద్ద హీరోలు, అందులో ప్రభాస్ అయితే పాన్ ఇండియా (Prabhas Pan India Star) స్టార్ కి ఎదిగిపోయారు, వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. ఇక ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (RamCharan) లను గ్లోబల్ స్టార్ అంటున్నారు. వాళ్ళందరూ వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ప్రజలకి తెలుసు, కానీ నేను తెలియకపోవచ్చు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎంతమాత్రం ఇగో ప్రాబ్లెమ్ లేదు. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, నా జనసేనకి (JanaSena) అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండి అని చెప్పారు.

ఈ ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ అంటే పరిశ్రమలో ఇప్పుడు అందరికీ మరికొంచెం గౌరవం పెరిగిపోయింది అంటున్నారు. అలాగే అందరి హీరోల అభిమానులు ఇప్పుడు తప్పకుండ పవన్ కళ్యాణ్ ని అభిమానించకుండా ఉండలేరు, అందుకోసం జనసేన పార్టీ కి, పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలుస్తారు అని పరిశ్రమలో అనుకుంటున్నారు.

Updated Date - 2023-06-22T13:27:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!