సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: సినీ పరిశ్రమ తలెత్తుకునేలా చేస్తారని ఆశిస్తున్నా..

ABN, First Publish Date - 2023-08-01T18:30:22+05:30

తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది.. కాబట్టి పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలుపుతూ.. కొత్తగా ఎన్నికైన వారందరికీ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

Pawan Kalyan

తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది.. కాబట్టి పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలుపుతూ.. కొత్తగా ఎన్నికైన వారందరికీ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభినందనలు తెలిపారు. గత ఆదివారం జరిగిన ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) ఎన్నికలలో దిల్ రాజు (Dil Raju) విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సి కళ్యాణ్‌పై విజయం సాధించిన దిల్ రాజు.. వెంటనే బాధ్యతలను కూడా స్వీకరించారు. తాజాగా దిల్ రాజు అండ్ టీమ్‌ (Dil Raju and Team)కు అభినందనలు తెలుపుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో ఏముందంటే..


‘‘తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గానికి అభినందనలు

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు. అధ్యక్షులుగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి, సెక్టార్ కౌన్సిల్ చైర్మన్లు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు.. మండలి కార్యకలాపాలను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తున్నాను. ఒక సినిమా నిర్మితమవుతోందంటే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. రూ.కోట్ల సంపద సృష్టి జరుగుతుంది. పన్నులు చెల్లిస్తారు. తెలుగు సినిమా స్థాయి వాణిజ్యపరంగా రోజురోజుకీ విస్తృతమవుతోంది. కాబట్టి పరిశ్రమ తలెత్తుకొని నిలిచేలా ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం పని చేస్తుందని ఆశిస్తున్నాను..’’ అని విడుదల చేసిన ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. (Pawan Kalyan Greetings To Dil Raju and Team)


ఇవి కూడా చదవండి:

**************************************

*Tiger Nageswara Rao: ఆ రూమర్స్‌కు బ్రేక్ వేస్తూ.. మరోసారి రిలీజ్ డేట్‌పై క్లారిటీ

**************************************

*Mrunal Thakur: బర్త్‌డే స్పెషల్‌గా ‘హాయ్ నాన్న’ టీమ్ ఇచ్చిన ట్రీట్ ఇదే..

**************************************

*Navdeep: స్వామీ.. నదికి పోలేదా? అంటే.. ‘నదే సిటీకి వచ్చింది’ అంటూ ప్రభుత్వంపై పంచ్

**************************************

*S Thaman: సాయి తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత బాధపడ్డానంటే..

**************************************

Updated Date - 2023-08-01T18:30:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!