సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan kalyan: కోలీవుడ్‌పై ఫైర్‌.. ఆ ధోరణి ఉంటే కుంచించుకుపోతాం!

ABN, First Publish Date - 2023-07-26T01:31:55+05:30

తమిళ సినిమాలో (kollywood) తమిళ నటులే నటించాలనీ, ఆ ప్రాంతంలోనే చిత్రీకరణలు జరపాలని ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా( ఫెఫ్సీ-FEFSI) తీసుకున్న నిర్ణయాన్ని పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) తప్పుబట్టారు.

తమిళ సినిమాలో (kollywood) తమిళ నటులే నటించాలనీ, ఆ ప్రాంతంలోనే చిత్రీకరణలు జరపాలని ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా( ఫెఫ్సీ-FEFSI) తీసుకున్న నిర్ణయాన్ని పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) తప్పుబట్టారు. ‘మంగళవారం జరిగిన ‘బ్రో’ (BRO)ఆడియో ఫంక్షన్‌లో ఆయన మాట్లాడారు. ‘‘తమిళ చిత్ర పరిశ్రమకు నాదొక విన్నపం. పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. తెలుగు చిత్ర పరిశ్రమ భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కళాకారులను ఆహ్వానిస్తుంది. అన్నం పెడుతుంది. తమిళంలో కూడా అలాగే కొనసాగితే పరిశ్రమ మంచి స్థాయికి చేరుతుంది. తమిళ పరిశ్రమ తమిళం వారికే అంటే పరిశ్రమ ఎదగదు. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుందీ అంటే అన్ని పరిశ్రమల వారినీ కలుపుకొని వెళ్తుంది కాబట్టే. ఒక్కళ్ళు కాదు. అన్ని భాషలు.. అన్ని కలయికలు ఉంటేనే సినిమా అవుతుంది తప్ప.. ‘ఇది మన భాష.. మనమే ఉండాలి’ అంటే.. కుంచించుకుపోతాం. తమిళ సినిమాల్లో తమిళవాళ్లే నటించాలనే నిబంధను గురించి ఇటీవల తెలిసింది. మీరు కూడా తమిళ పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమా తీయాలని, మీ పరిశ్రమను విస్తృతం చేసుకోవాలని తమిళ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా. ఉదాహరకు తమిళంలో ‘రోజా’, ‘జెంటిల్‌మెన్‌’ లాంటి సినిమాలు వచ్చాయంటే కారణం నిర్మాత ఎ.ఎం రత్నం. ఆయన తెలుగువాడు. కళాకారుడుకు కులం, మతం, ప్రాంతీయ బేధాలు ఉంటే ఆ ఇండస్ట్రీ ఎదగదు. పరిశ్రమలో కార్మికులకు సమస్యలు ఉంటే పరిష్కరించుకొని అందరు ఒక్కటిగా ఉండాలి. పరిధిని దాటి ఎదగాలి. ఇదే నేను తమిళ సినీ పెద్దలను కోరేది’’ అని అన్నారు.

Updated Date - 2023-07-26T01:31:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!