కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan : స్నేహపూర్వక ప్రవర్తన.. మనసును కదిలించింది

ABN, First Publish Date - 2023-11-23T18:01:17+05:30

పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ప్రస్తుతం రాజకీయ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వరుస పర్యటనల్లో ఉన్నారు. గురువారం ఆయన ఓ ప్రత్యేక వీడియోను ఇన్ స్టాగ్రామ్ షేర్‌ చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఓ అనుకోని అతిథి తనని కలిసిందని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ (Pawan kalyan) ప్రస్తుతం రాజకీయ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా వరుస పర్యటనల్లో ఉన్నారు. గురువారం ఆయన ఓ ప్రత్యేక వీడియోను ఇన్ స్టాగ్రామ్ షేర్‌ చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఓ అనుకోని అతిథి తనని కలిసిందని ఆయన తెలిపారు. ‘‘బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్‌ కోసం ఎదురుచూస్తున్నప్పుడు డాగ్‌ స్క్వాడ్‌కు చెందిన బిందు అనే జాగిలం అనుకోని అతిథిగా నా వద్దకు వచ్చింది. దాని స్నేహపూర్వక ప్రవర్తన నా మనసుకు ఆనందాన్ని ఇచ్చింది. టేకాఫ్‌కు ముందు ఊహించని విధంగా ఓ అందమైన అనుభూతినిచ్చింది’’ అని పవన్ ఈ వీడియో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను నెట్టింట విపరీంగా వైరల్‌ అవుతోంది. తాజాగా ఆయన షేర్‌ చేసిన జాగిలం వీడియోను 6.33 లక్షలకు పైగా లైక్‌ కొట్టారు. (Janasena)

ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవనకల్యాణ్‌ 'ఉస్తాద్‌ భగతసింగ్‌', 'ఓజీ', హ'రిహర వీరమల్లు'చిత్రాలు చేస్తున్నారు. aఈ ఏడాది ఆయన నటించిన 'బ్రో చిత్రం సూపర్‌హిట్‌ టాక్‌తో నడిచింది.

Updated Date - 2023-11-23T18:01:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!