సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pawan kalyan - Unstoppable: ఆ అభిమానాన్ని.. ఓట్లుగా మలచుకోలేకపోవడానికి కారణం!

ABN, First Publish Date - 2023-01-21T12:38:23+05:30

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అటు రాజకీయాలతోనూ.. ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ‘ఆహా’ ఓటీటీలో పాపులర్‌ షోగా గుర్తింపు పొందిన ‘అన్‌స్టాపబుల్‌’ షోకు అతిథిగా హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (powerstar pawan kalyan) అటు రాజకీయాలతోనూ.. ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ‘ఆహా’ ఓటీటీలో (aha ott) పాపులర్‌ షోగా గుర్తింపు పొందిన ‘అన్‌స్టాపబుల్‌’ (Unstoppable2)షోకు అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఉన్న అతిథిని బట్టి ఇందులో వ్యాఖ్యాత తనదైన శైలి ప్రశ్నలు వేస్తుంటారు. మరి పవన్‌లాంటి స్టార్‌ హీరో, రాజకీయ పార్టీ అధినేత ఎదురుపడితే ప్రశ్నలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. సినిమా, రాజకీయం (Cinema-Politics)ఈ రెండింటికి సంబంధించి పవన్‌ పూర్తి స్థాయిలో ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ఈ షోలో ఆ అవకాశం దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. దీని కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తయింది. ఫిబ్రవరిలో ఆహాలో స్ర్టీమింగ్‌ కానుంది. తాజా ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోను విడుదల చేశారు. షోకు పవన్‌ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయిందని అభిమానులు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు.

అయితే ఇందులో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హీరోలు అందరినీ ‘‘నన్ను ఫలానా పేరుతోనే పిలవండి’ అని అడుగుతాను. అలాగే మిమ్మల్ని అడుగుతాను అని సదరు వ్యాఖ్యాత అనగానే ‘‘నేను ఓడిపోవడానికి సిద్థం కానీ.. మిమ్మల్ని అలా పిలవలేను’’ అని పవన్‌ నవ్వేశారు. ఈ మఽధ్యన విమర్శలు చేయడంలో కాస్త వాడీవేడి ఇంపాక్ట్‌ పెరిగింది అనగానే... ‘నేను చాలా పద్థతిగానే మాట్లాడుతున్నానండీ..’’ అంటూ పవన్‌ సమాధానమిచ్చారు. ‘‘చిరంజీవి మీ అన్నయ్య.. ఆయన నుంచి నేర్చుకున్నవి ఏంటి? వద్దనుకొన్నవి.. ఏమిటి’’ అన్న ప్రశ్నకు పవన్‌ ఉద్వేగభరితమైన జవాబు ఇచ్చినట్టు ప్రోమోలో తెలుస్తోంది. వదిన సురేఖతో ఉన్న అనుబంధం గురించి పవన్‌ చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘మీ అభిమాని కానివాడు లేడు(Fan base).. ఆ అభిమానాన్ని ఓట్లుగా మలచుకోవడంలో ఎందుకు విఫలమయ్యారు’ అన్న ప్రశ్నకు పవన్‌ ఎలా స్పందించారు. వదినా ఇదే నా లాస్ట్‌ సినిమా ఇక నా వల్ల కాదు అని తన వదిన సురేఖకు ఫోన్‌ చేసినప్పుడు ఆమె ఏం చెప్పింది అన్నది తెలుసుకోవాలంటే ఫిబ్రవరిలో టెలికాస్ట్‌ అయ్యే అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే!

Updated Date - 2023-01-21T12:38:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!