PavitraNaresh: మహేష్, నమ్రత నన్ను కుటుంబ సభ్యురాలిగా యాక్సెప్ట్ చేశారు: పవిత్ర
ABN, First Publish Date - 2023-05-23T17:20:57+05:30
పవిత్ర లోకేష్ ఇప్పుడు పవిత్ర నరేష్ గా మారబోతోంది, ఎందుకంటే ఆమె మహేష్ బాబు, నమ్రతలను కలిశానని వాళ్లకు తమని కుటుంబ సభ్యురాలిగా యాక్సెప్ట్ చేశారని చెప్పింది. అలాగే 'మళ్ళీ పెళ్లి' మంచి సినిమా అని, ఎవరిని టార్గెట్ చేసి తీయలేదని కూడా చెప్పింది. ఆ సినిమా కల్పితమా, యధార్ధమా అన్నది సినిమా చూస్తే అర్థం అవుతుంది అని చెప్పింది.
చాలా మీడియా మీటింగ్స్ లో సీనియర్ నటుడు వి. కె. నరేష్ (VKNaresh) ని మీరు పవిత్రని (PavitraLokesh) వివాహం చేసుకున్నారా లేదా, అని అడిగిన ప్రశ్నకు నరేష్ డైరెక్ట్ సమాధానం ఇవ్వకుండా పెళ్లిని గౌరవిస్తాను, కానీ రెండు మనసులు కలిస్తే చాలు అని అన్నాడు. అయితే నరేష్ ఆలా అంటూనే, అతను పవిత్ర ఒకే ఇంట్లో ఉండటం పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. అలాగే వాళ్లిద్దరూ కలిసే వస్తున్నారు, కలిసే వెళ్తున్నారు, వేదికలమీద దండలు మార్చుకుంటున్నారు, కానీ ఇంకా పెళ్లి కాకుండా ఇద్దరూ కలిసే వుంటున్నారు అని అనుకోవలసి వస్తోంది.
ఎందుకంటే పవిత్ర లోకేష్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను మహేష్ బాబు (MaheshBabu), నమ్రతని (NamrataShirodkar)కలిశానని వాళ్ళు తనని తమ కుటుంబ సభ్యురాలిగా యాక్సెప్ట్ చేశారని చెప్పింది. అలాగే విజయనిర్మలని కలిసినప్పుడు ఆమె ఆరోగ్యం అంతగా బాగోలేదని, అందుకని ఆమెతో ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని చెప్పింది. అయితే కృష్ణ గారితో చాలా ఎక్కువ సమయం గడిపానని అతని నుండి ఎన్నో నేర్చుకున్నాను అని చెప్పింది పవిత్ర.
అలాగే మళ్ళీ పెళ్లి గురించి ఆమె అభిప్రాయం అడగ్గా, పవిత్ర కొంచెం ఎమోషనల్ అయ్యింది. "సమాజంలో చాలా నిబంధనలు ఉంటాయి, అలాగే ఎవరి ఆలోచన, అభిప్రాయాలతో వాళ్ళు ఉంటారు. నా విషయానికే వస్తే, కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా చూపారు. నా వ్యక్తిత్వ హననం చేసి, నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం. నేను ఒంటరిగా వుంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఇంట్లో కూర్చోవాలి. కానీ నేను బయటికి వచ్చానంటే కారణం నరేష్ గారు. నా వెనుక బలంగా నిల్చొని, నేనున్నానని చెప్పారు. నేను ఒక్క అడుగు వెనక్కి వేసినా పరిస్థితి దారుణంగా వుండేది. నరేష్ గారు చాలా సపోర్ట్ గా వున్నారు," అని చెప్పింది పవిత్ర.
ఈ సినిమాలో #MalliPelli యదార్ధ సంఘటనలు ఉన్నాయా అని అడిగితే, "ఇది కల్పితమా? యాదార్ధమా? అనేది ఇప్పుడు చెప్పలేను. సినిమా చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది", అని చెప్పింది. అలాగే ఈ సినిమా ఎవరినీ టార్గెట్ చేయడానికి చేసిన సినిమా కాదు అని చెప్పింది, ఎందుకంటే ఒకరిని టార్గెట్ చెయ్యాలంటే సినిమా తీయాల్సిన అవసరం లేదు అని చెప్పింది.