సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pavithra -Naresh: వేదికపై దండలు మార్చుకుని.. ముద్దులు పెట్టుకుని..

ABN, First Publish Date - 2023-05-22T12:53:09+05:30

పవిత్రా - నరేశ్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్‌ పెయిర్‌ ఏ మాధ్యమం చూసిన ఈ జంట ప్రస్తావనే. అందుకు ఒక కారణం తాజాగా ఈ జంట నటించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రం. ఇద్దరం ఒకటి కాబోతున్నాం అంటూ వేదికలపై వీరు చేసే హడావిడి మరో కారణం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవిత్రా - నరేశ్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్‌ పెయిర్‌ (pavithra Lokesh)

ఏ మాధ్యమం చూసిన ఈ జంట ప్రస్తావనే. (Vk Naresh)

అందుకు ఒక కారణం తాజాగా ఈ జంట నటించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రం. (Malli pelli)

ఇద్దరం ఒకటి కాబోతున్నాం అంటూ వేదికలపై వీరు చేసే హడావిడి మరో కారణం.

దీనితో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ కావడంతోపాటు ట్రోలింగ్‌కు గురయ్యారు. (Trolling on Naresh)

తాజాగా ఓ ఇన్సిడెంట్‌తో మరోసారి ఈ జంట ట్రెండింగ్‌లో ఉన్నారు. ఓ వేదికపై ఈ జంట రొమాంటిక్‌ పాటకు స్టెప్పులు వేశారు. వేదికపై ఇద్దరూ పూల దండలు మార్చుకున్నారు. అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్నారు. దీనంతటికి ‘మళ్లీ పెళ్లి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా మారింది. దర్శకుడు ఎం. ఎస్‌. రాజు తెరకెక్కించిన ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పవిత్రా లోకేశ్‌ వేదికపై భావోద్వేగంగా మాట్లాడారు. మొదట నరేశ్‌, ఎమ్మెస్‌ రాజ్‌లకు కాళ్లకు నమస్కరించి స్పీచ్‌ మొదలుపెట్టారు. (Romantic Dance)

ఆమె మాట్లాడుతూ ‘‘ఇది దేవుడు ఇచ్చిన లైఫ్‌. ఎలా రాస్తే అలా బతికేస్తుంటాం. ఇప్పుడు నాకు ఆ అదృష్టం వచ్చింది. ఏ ఆడపిల్లకైనా జీవితంలో కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. అది చేయాలి.. ఇది చేయాలి.. అవి కొనాలి.. ఇంత సంపాదించాలి అని. ఆ కోరికలు నాక్కూడా ఉన్నాయి. ఆ డ్రీమ్స్‌ను ఫుల్‌ ఫిల్‌ చేయడానికి మా నాన్నగారు కూడా లేరు. నా చిన్నతనంలోనే ఆయన వెళ్లిపోయారు. దాంతో ఒంటరి పోరాటం చేశా. నాకంటూ ఓ స్పేస్‌ క్రియేట్‌ చేసుకుని కష్టపడి ఈ స్థాయికి వచ్చా. నా లైఫ్‌ని బిల్డ్‌ చేసుకున్నా. నా అనుమతి లేకుండా కొన్ని దుష్టశక్తులు దాన్ని బ్రేక్‌ చేశాయి. దానికి తగ్గట్టే నేనూ చేశా. ఇప్పుడు ఆ విషయాల్ని తలచుకుంటే ఏదోలా ఉంటుంది. ఇప్పుడు నన్ను కాపాడటానికి నా వెనుకు ఓ శక్తి ఉది. ఆ శక్తి నరేశ్‌. ఈ శక్తి గురించి ఆ దుష్టశక్తులకు తెలియదు. మళ్లీ ఎదిగేందుకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. నా కుటుంబంతోసహా కృష్ణగారు, మహేశ్‌బాబు అభిమానులంతా నన్ను అంగీకరించారు. నరేష్‌ లాంటి సంస్కారం ఉన్న వ్యక్తిని నాకు ఇచ్చినందుకు మహాతల్లి విజయనిర్మల గారికి థాంక్స్‌ చెప్పాలి’’ అని అన్నారు.

Updated Date - 2023-05-22T12:53:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!