Biggboss 7 : హౌస్‌లో చూడగానే కాళ్ల మీద పడి..
ABN, First Publish Date - 2023-11-10T16:35:08+05:30
బిగ్‌బాస్ 7 (Biggboss 7) ఉల్టా -పుల్టా సీజన్ పదోవారానికి చేరుకుంది. హౌస్మేట్స్ ను విచిత్రమైన ఆటలతో ఆడుకుంటున్నాడు బిగ్‌బాస్. మధ్యమధ్య కాస్త ఊరట కూడా కలిగిస్తున్నాడు. గత రెండు మూడు రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో 68 రోజులుగా ఉంటున్న హౌస్‌మేట్స్‌కి సర్ప్రైజ్ ఇస్తున్నాడు.
బిగ్‌బాస్ 7 (Biggboss 7) ఉల్టా -పుల్టా సీజన్ పదోవారానికి చేరుకుంది. హౌస్మేట్స్ ను విచిత్రమైన ఆటలతో ఆడుకుంటున్నాడు బిగ్‌బాస్. మధ్యమధ్య కాస్త ఊరట కూడా కలిగిస్తున్నాడు. గత రెండు మూడు రోజులుగా బిగ్‌బాస్ హౌస్‌లో 68 రోజులుగా ఉంటున్న హౌస్‌మేట్స్‌కి సర్ప్రైజ్ ఇస్తున్నాడు. తమ కుటుంబ సభ్యులను ఇంటిలోకి పంపి సర్ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా వదిలిన ప్రోమో ప్రకారం శుక్రవారం హౌస్‌లోకి పల్లవి ప్రశాంత్(Prasanth pallavi), రతికల పేరెంట్స్ వచ్చినట్లు చూపించారు. పల్లవి ప్రశాంత తండ్రి హౌస్‌లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ముందుగా ప్రశాంత్ కోసం బంతిపూలను పంపించారు బిగ్‌బాస్. వాటిని చేతితో పట్టుకుని 'చాలా రోజులు అవుతుంది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్.
ఆ తర్వాత బాపు బంగారం అంటూ చేతిలో బంతిపూలతో బిగ్‌బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు ప్రశాంత్ తండ్రి. వెంటనే ప్రశాంత్.. తండ్రి దగ్గరికి పరుగున వెళ్లి.. కాళ్ల మీద పడి ఏడ్చాడు. ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. 'మా నాన్న బిగ్‌బాస్‌లోకి వచ్చాడు అంటూ ఎగిరి గంతేశాడు. తండ్రిని ఎత్తుకుని గిర్రును తిప్పాడు. 'తగ్గేదేలే బిడ్డ.. టాలెంట్‌తో ఆడు. కన్నీరు పెట్టుకోకు. అవన్నీ అమ్మ చూసి ఏడుస్తోంది. ఆమెకు బీపీ పెరుగుతోంది’ అని ప్రశాంతను హత్తుకున్నాడు తండ్రి. ఒకరికొకరు అన్నం తినిపించుకున్నారు. 'చచ్చిన, బతికినా నాకు అన్నీ వీడే' అని భావోద్వేగానికి లోనయ్యారు ప్రశాంత తండ్రి. తర్వాత వారిద్దరి దగ్గరకు శివాజీరాగా.. 'నా కొడుకును కన్న కొడుకులాగా చూసుకున్నారు’ అంటూ దండం పెట్టాడు ప్రశాంత్ తండ్రి. (Prashanth Emotional)
ఇంట్లో ఒక్కొక్కరిని పలకరిస్తూ అందరూ కలిసిమెలిసి ఉండండి.. కొట్లాడకండి అంటూ ఆప్యాయంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే యావర్, శోభాశెట్టి, శివాజీ, అమర్ దీప్, గౌతమ్, అర్జున్, అశ్విని, భోలే షావలి కుటుంబ సభ్యులు ఇంట్లోకి రాగా.. తమ ఇంటి వాళ్లను చూడగానే తెగ సంబరపడిపోయారు.