Game On: అన్నదమ్ముల కాంబినేషన్‌లో ‘గేమ్ ఆన్’.. పాటతో పడగొట్టేశారు
ABN, First Publish Date - 2023-03-26T00:40:27+05:30
గీతానంద్ (Geetanand), నేహా సోలంకి (Neha Solanki) (90 ఎంఎల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్’ (Game On). కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై
గీతానంద్ (Geetanand), నేహా సోలంకి (Neha Solanki) (90 ఎంఎల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్’ (Game On). కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ (Dayanand) దర్శకత్వంలో రవి కస్తూరి (Ravi Kasturi) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఉన్న విశేషం ఏమిటంటే.. తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం. మధుబాల (Madhubala), ఆదిత్య మీనన్ (Adithya Menon) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘పడిపోతున్న’ అంటూ సాగిన ఈ పాటకు కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించారు. అశ్విన్- అరుణ్ సంగీతం అందించారు. అనురాగ్ కులకర్ణి - హారిక నారాయణ్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాత సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోంది.
తొలిసారి కాదా ఈ ప్రేమ...
ఎదలోని ఉంది నువ్వేనా..
ఇన్నాళ్లు లేని హైరానా
అలవాటుగానే కలిగేనా
పడిపోతున్న నిన్ను చూస్తూ... అనే సాహిత్యంతో ఉన్న ఈ పాటను వినగానే ఇద్దరు ప్రేమికుల మనసులోని ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లుగా ఉంది. అనురాగ్ కులకర్ణి, హారికా నారాయణ్ వాయిస్ ఈ పాటకు జీవం పోసినట్లుగా ఉంది. (Padipothunna Lyrical Song Out)
పాట విడుదల సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.. ఇప్పటికే విడుదల చేసిన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవాబ్ గ్యాంగ్ మా సినిమా కోసం చక్కని సంగీతం అందించారు. గతంలో పలు చిత్రాలకు పనిచేసి.. ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రానికి టైటిల్ సాంగ్‌కి పనిచేశారు. అంత బిజీలోను మా చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. ఇపుడు విడుదల చేసిన రెండో పాట కూడా అందరినీ అలరిస్తోంది. ఈ సినిమాకు అన్నదమ్ములు వర్క్ చేస్తున్నారు. ఒకరు హీరోగా, ఒకరు డైరెక్టర్‌గా ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వారిద్దరూ కలిసి నాకు చెప్పిన కంటెంట్ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడం జరిగింది. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు రావడమే కాదు.. సక్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవలోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. (Game On Telugu Movie)
ఇవి కూడా చదవండి:
*********************************
*Manoj Manchu: బతకండి.. బతకనివ్వండి.. మంచు మనోజ్ మరోసారి సంచలన ట్వీట్!
*Nani Dasara: సెన్సార్ పూర్తి.. అయ్యబాబోయ్ ఏంటి ఇన్ని కండీషన్స్?
*Bhanushree Mehra: మరో బాంబ్ పేల్చిన అల్లు అర్జున్ ‘వరుడు’ హీరోయిన్
*The Elephant Whisperers: వారి ఆనందానికి ఆస్కార్ అవార్డ్ ఏం సరిపోతుంది?
*Naresh and Pavitra Marriage: నరేష్, పవిత్రల పెళ్లి.. అసలు కథ ఇదేనా?
*Srikanth: ఆ రూమర్స్ భరించలేకే.. భార్యతో కలిసి వెళుతున్నా..
*Brahmanandam: నాకు మోక్షం వద్దు.. మళ్లీ మళ్లీ జన్మించాలనే కోరుకుంటా!
*Trivikram Srinivas: ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి.. ఈ పాత్రను పోషిస్తున్నారు
*NTR30: ఈ టెక్నీషియన్స్ మాటలు వింటే.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు
*Madhav: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న రవితేజ వారసుడు.. ఎవరి డైరెక్షన్‌లో అంటే?
*Rangamarthanda: బ్రహ్మీ నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ఫిదా!.. ఇద్దరూ కలిసి ఏం చేశారంటే?
*Singer Dhee: దసరా మూవీలోని ‘ఛమ్కీల అంగీలేసి’ పాట సింగర్ గురించి ఈ విషయం తెలుసా?