సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Arjun: ఆ చిన్నపిల్లని ఇప్పుడు చూస్తే షాక్ అవుతారు

ABN, First Publish Date - 2023-03-06T13:25:03+05:30

'గంగోత్రి' సినిమాలో అల్లు అర్జున్ తో ఈ ఫోటో లో వున్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే షాక్ అవుతారు. ఆమె ఇప్పుడు ఏమి చేస్తోందో తెలుసా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా చేసిన మొదటి సినిమా గుర్తింది కదా! సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు (K Raghavendra Rao) దర్శకత్వం లో వచ్చిన 'గంగోత్రి' (Gangotri). ఇందులో అదితి అగర్వాల్ (Aditi Agarwal) కథానాయికగా చేసింది. అయితే అందులో అదితి అగర్వాల్ పేరు గంగోత్రి, కానీ చిన్నప్పటి గంగోంత్రి గా కావ్య (Kavya) అనే అమ్మాయి వేసింది. మీరు చూసిన ఈ ఫోటోలో అల్లు అర్జున్ తో వున్న ఆ అమ్మాయే ఆ కావ్య. ఈ సినిమా విడుదల అయి మార్చి 28, 2003 లో విడుదల అయింది, అంటే ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది. ఆ సినిమా తో పాటు, సినిమాలో పాటలు కూడా అప్పట్లో పెద్ద విజయం సాధించాయి. అలాగే అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా 'బాలు' లో కూడా చైల్డ్ ఆర్టిస్టు గా చేసింది కావ్య. ఈ సినిమా 2005 లో విడుదల అయింది.

అయితే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో చేసిన ఆ చిన్ని పాప, ఇప్పుడు ఏమి చేస్తోందో చూస్తే మీరు షాక్ అవుతారు. ఆమె మరెవరో కాదు, కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram). ఆమధ్య 'మసూదా' (Masooda) అనే థ్రిల్లర్ సినిమాలో కథానాయికగా చేసి అందరి మెప్పు పొందింది. అలాగే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన 'బలగం' (Balagam) అనే సినిమాలో కూడా కథానాయకిగా చేసి అందరినీ మెప్పించింది. 'బలగం' సినిమా గత వారం విడుదల అయి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇందులో ఆ 'గంగోత్రి' లో నటించిన కావ్య, కథానాయికగా కనపడటం విశేషం. ఈ అమ్మాయేనా అని ఆశ్చర్యపోయేంతగా ఇప్పుడు కథానాయికగా తయారయింది.

'బలగం' సినిమాలో కథానాయికగా చాలా చక్కగా చేసింది కావ్య. ఎదో మామూలు సినిమాలో కథానాయికగా కాకుండా, ఇందులో అమీ పాత్రకి చాలా ప్రాముఖ్యం వుంది. ఆమె చేసే కొన్ని సన్నివేశాలు వలన, కథ వేరే విధంగా తిరుగుతుంది. చిన్న చిన్న హావభావాలతో ప్రేక్షకులని బాగా మెప్పించింది.

Updated Date - 2023-03-06T13:25:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!