Dasara: ఈ అభిమాని సినిమా చూసి ఏమి చేసాడో చూస్తే షాక్ అవుతారు
ABN, First Publish Date - 2023-03-30T14:03:37+05:30
ఈమధ్య తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ అతిగా ఉంటున్నాయి అన్న విమర్శ ఎక్కువయింది, అలాగే అభిమానులు కూడా బాగా అతి చేస్తున్నారు అన్న విమర్శా కూడా వుంది. ఈ అభిమాని ఈరోజు 'దసరా' సినిమా చూసి ఏమి చేసాడో చూస్తే షాక్ అవుతారు....
తెలుగు నటులకి ఉన్నంత అభిమానులు కానీ, సంఘాలు కానీ మరి ఏ ఇతర భాషా నటులకి కూడా లేవనిపిస్తూ ఉంటుంది. అందుకే నటులు ముఖ్యంగా అగ్ర నటులు కొంచెం ఈ అభిమానులని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని తమ సినిమాల్లో పాత్రలు చేస్తూ వుంటారు. కానీ ఈమధ్య కొన్ని తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ లో చాలా సన్నివేశాల్లో అతి ఎక్కువయిందని అందరూ బాగా విమర్శిస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ నటుల్ని అభిమానించే అభిమానులు కూడా ఆలా నటుల్ని అనుకరించి ఆ సినిమా గురించి మాట్లాడటం. ఇదే సంఘటన ఈరోజు విడుదల అయిన 'దసరా' (#DasaraFilm) సినిమా విషయం లో జరిగింది.
ఈ 'దసరా' (DasaraReview) సినిమాలో నాని (Nani) పాత్ర బాగా తాగుతూ ఉంటాడు, అలాగే బొడ్డు చుట్టూ ఒక నాలుగు అయిదు ఆల్కహాల్ బాటిల్స్ కూడా కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ తాగటం లో కూడా స్టైల్ ఉండాలి కదా, ఎందుకంటే కథానాయకుడు కదా అందుకని స్పెషల్ గా పరిగెడుతూ చేత్తో పట్టుకోకుండా బాటిల్ తిరగేసి నోట్లో పెట్టుకొని తాగుతూ ఉంటాడు. మరి అది స్ఫూర్తిగా తీసుకున్నాడేమో ఒక అభిమాని నాని చేసినట్టుగానే బాటిల్స్ మేడలో వేసుకొని ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐరన్ ఫెన్స్ ఎక్కేసాడు.
ఈ అభిమానం మరీ అతిగా ఉందని అక్కడకి వచ్చిన ప్రేక్షకులు అందరూ అనుకుంటున్నారు. వెంటనే ఒక సెక్యూరిటీ గార్డ్ ఫెన్స్ ఎక్కి ఆ అభిమానిని కిందకి దించాడు. ఫెన్స్ ఎక్కిన అభిమానికి కిందపడి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు. ఇలా బాధ్యతారహితంగా అభిమానులు చేస్తూ ఉంటే ఎలా అని అక్కడ ప్రేక్షకులు కూడా వాపోతున్నారు. పోనీ అదేమయినా మంచి పాత్ర అని అనుకుంటే అది కూడా కాదు అని అంటున్నారు.
ఈమధ్య వెంకటేష్ (Venkatesh) కి కూడా ఇలానే అయింది. ఎంతో మంచి ఇమేజ్ వున్న వెంకటేష్ 'రానా నాయుడు' (RanaNaiduWebSeries) అనే వెబ్ సిరీస్ లో చేసాడు. అందులో తన అన్న కుమారుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) కూడా చేసాడు. ఇది పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో కూడిన వెబ్ సిరీస్ అవటం, వెంకటేష్ (RanaNaidu) పిల్లాడితో కూడా బూతులు మాట్లాడటం ఒక్కసారిగా సమాజంలో అన్ని వర్గాల వారి నుండి వ్యతిరేకత వచ్చింది. చేసేది లేక ఆ వెబ్ సిరీస్ ని తొలగించారు. దానివల్ల వెంకటేష్ ఇమేజ్ కి బాగా డేమేజ్ అయింది. అందువల్ల ఇంతమంది అభిమానులు వున్న తెలుగు నటులు తమ సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు చేసేటప్పుడు కేవలం డబ్బులు కోసమే కాకుండా, అభిమానులని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని ప్రేక్షకులు అంటున్నారు.